10_013

10_013 వాగ్గేయకారులు – క్షేత్రయ్య … తేనె పలుకుల పదాల కవి

పదాలలో చాలావరకూ విరహోత్కంఠిత నాయికా ప్రదర్శనం జరుగుతుంది. శృంగారం ప్రధానాంశంగా మధురభక్తి
రూపంగా వెల్లడి అవుతుంది. మధురభక్తిలో, రచయిత తనను నాయికగానూ, భగవంతుణ్ణి నాయకుడిగా భావించి భక్తిభావం అనురక్తి తెలియచేయటం జరుగుతుంది. ఇక్కడ నాయిక అంటే జీవాత్మ అని, అది పరమాత్మ అనబడే భగవంతునితో ఐక్యమవ్వాలనే తపనే ఒక విచిత్రమైన భక్తిభావంగా కవితారూపంలో వెలువడుతుంది.

10_013 సూర్యస్తుతి

మనకి ఎంతమంది దేవుళ్ళు ఉన్నా అందరికీ ప్రత్యక్ష దర్శనం లభించదు. అయితే రోజూ ప్రత్యక్ష దర్శన భాగ్యం కలుగజేసే దైవం సూర్యనారాయణుడు. అందుకే ఆయనను ప్రత్యక్ష దైవం అంటుంటాం. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. సూర్యరశ్మి లో భూమి మీద ఉండే జీవులన్నిటికీ అవసరమైన పోషకాలు, రక్షకాలు ఎన్నో ఉంటాయి. వాతావరణ పరిస్థితులను కూడా సూర్యుడు ప్రభావితం చేస్తాడు. భూమికి కావల్సిన వెలుతురుని అందించేది సూర్యుడే. ఇలా ఎన్నో విధాలుగా భూమి మనుగడకు, భూమి మీద జీవం మనుగడకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణభూతుడవుతున్న ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడు.

10_013 భీష్మ ఏకాదశి

మహాభారతంలో భీష్మునికి ప్రముఖమైన స్థానం ఉంది. మాఘ శుద్ధ అష్టమి భీష్ముడు నిర్యాణం చెందిన రోజు. కనుకనే ఆరోజు భీష్మాష్టమి గా పిలువబడుతోంది. ఆ తర్వాత వచ్చే ఏకాదశి, ద్వాదశి తిథులను కూడా భేష్ముని పేరు మీద భీష్మ ఏకాదశి, భీష్మ ద్వాదశి అని పిలువబడుతున్నాయి.
మహాభారతంలో భీష్మునికి అంత ప్రాధాన్యం రావడానికి ప్రధానమైన కారణం శ్రీకృష్ణుడు, భీష్ముడు…. ఇద్దరూ అష్టమ గర్భ సంజాతులే.