10_014

10_014 వార్తావళి

వంగూరి ఫౌండేషన్ నిర్వహిస్తున్న “ 26వ ఉగాది ఉత్తమ రచనల పోటీ ” వివరాలు, కృష్ణా జిల్లా రచయితల సంఘం స్వర్ణోత్సవ కార్యక్రమ వివరాలు….

10_014 ఆనందవిహారి

చెన్నై లోని వేద విజ్ఞాన వేదిక తమ ‘ తర తరాల తెలుగు కవిత ’ ఉపన్యాస ధారావాహిక 122వ ప్రసంగం శ్రీ కోట రాజశేఖర్ గారి “ షోడశగుణముల రాముడు ” విశేషాలు…..

10_014 కీకారణ్యంలో రొద

“ఈ అడవి మోటు వాళ్ళు, స్త్రీ పురుషుల తేడాలను – దుస్తులు, అలంకారాదులలలో పాటించే అవసరం లేనివాళ్ళు……., లేడీస్ డ్రెస్సులని కూడా – ఒంటి మీది తోలు అనుకుని, పుడింగిన లాక్కోవచ్చును కదా ! అందుకే తమవి ఇచ్చి, వాళ్ళని నిలువరించగలమేమో – అని, చిన్న ప్రయత్నం చేయబూనుకున్నారు.

10_014 తో. లే. పి. – లిండా స్యు పార్క్

చాలా చక్కటి పుస్తకం ఇది. పేరు ” A single shard ” ( పగిలిన పింగాణీ పాత్ర ) ఇంటికి వస్తూనే ఆ పుస్తకాన్ని ఏక బిగిని చదివేసాను. అంత గొప్ప కథాంశం ఉంది అందులో. 12 వ శతాబ్ది కాలం లో కొరియా దేశంలోని జీవన సంఘర్షణ నేపధ్యం లో ఈ రచన సాగింది. 12 సంవత్సరాల వయసున్న అనాధ బాలుడు, ట్రీ ఇయర్. నా అన్నవాళ్లు లేక, ఉండడానికి వసతి లేక ఒక బ్రిడ్జి కింద జీవితాన్ని అతి సామాన్యం గా వెళ్లబోసేవాడు.

10_014 అమెరికా ఇల్లాలి ముచ్చట్లు – తెలుగు సంఘాల తికమక

అక్షరాలూ అటుమార్చి ఇటుమార్చి కొత్త సంఘాలు ఎన్ని ఏర్పడినా, మనుషుల ఆలోచనలో మార్పు ఏమి లేదు. సభల పేరుతో లక్షల కొద్దీ డాలర్లు ఖర్చుపెడుతూ, హంగామా జరపటమే ఆనవాయితీగా అయిపోతోంది. ఎవరికి వాళ్ళు మేమే సేవ చేస్తున్నాం అని, డప్పు వాయించుకోవడం రొటీన్ అయిపోయింది. “ మన సంస్కృతి సంప్రదాయం అంతా వేదిక మీద రాశి పోసి తెలుగుతనం ఉట్టిపడేలా సభలు జరపబోతున్నాం ” అంటూ జనాలకు ముందుగా బిల్డప్ ఇచ్చేయడం అలవాటైపోయింది.

10_014 పాలంగి కథలు – శ్రీకృష్ణ భావనానందం

భక్తీ, భావుకతా ఉన్న ప్రతి ఒక్కరూ భావించుకుని, పరవశంతో మైమరచే రూపగుణ సంపద శ్రీకృష్ణునిది. అందమే ఆనందం కదా! పాంచ భౌతికమైన అందమే ఆనందానికి హేతువై మనసును మైమరపింప చేస్తుంటే…మరి ఆ అలౌకికమైన, దైవికమైన అందపు ఆనందం ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లి పరమానందాన్ని అందించడంలో ఆశ్చర్యమేముంది?!

10_014 కథావీధి – చాసో కథలు 3

ఉండబట్టలేక బడి దాకా వెళ్లిన కృష్ణుడికి అక్కడ వాతావరణం కొత్త పుస్తకాల వాసనతో, కొత్త బట్టల తళుకులతో, పిల్లల కేరింతలతో, నిండిపోయి కనిపిస్తుంది. అందులో తాను లేకపోవడం ఉక్రోషానికీ, వేదనకీ గురి చేస్తుంది. తాను అందరిలాగా చిరుతిళ్ళకీ, కొత్త బట్టలకీ, పుస్తకాల సంచీలకీ పేచీలు పెట్టలేదు, టెస్ట్ పుస్తకాలు అవికూడా ఇంగ్లీషు, లెక్కలలాంటి అత్యవసరమైన పుస్తకాలు మాత్రం కొనిమ్మన్నాడు. స్కూల్ ఫీజు కడితే చాలన్నాడు. తండ్రికి అది కూడా కుదరలేదు.

10_014 బాలభారతం – ఎందుకు ?

సలసల క్రాగేనూనెను తాకిన
ౘన్నీ ళ్లెందుకు మండుతున్నవి ?
ఉద్రేకంలో ఊగేవాడికి
నీతి చెప్పవ ద్దంటున్నాయి!