10_014 వాగ్గేయకారులు – రామతీర్థ నారాయణస్వామి
శ్రీకృష్ణ లీలాతరంగిణి సంస్కృతంలో వ్రాయబడిన సంగీతరూప కావ్యం. దీనిలోని కవితాశైలి, పదలాలిత్యం, దరువులు, శ్లోకాలు, గద్యాలు, కీర్తనలు చూస్తే ఇది యక్షగాన వర్గంలో చేరినదని తెలుస్తుంది. శుద్ధమైన ఉచ్ఛశ్రేణి సంస్కృత భాషా పాండిత్యం లేకపోయినా తెలుగు భాష తెలిసిన వారికీ ఈ కావ్యంలోని భావాభివ్యక్తి తేలికగా బోధపడినందువలన ఇది అత్యంత ప్రాచుర్యం పొందినదనటంలో సందేహం లేదు. శ్రీకృష్ణుని లీలలను తరంగాల ద్వారా పాడటం చేత దీనికీ పేరు చక్కగా సరిపోయింది.