10_015

10_015 వాగ్గేయకారులు – స్వాతి తిరునాళ్

స్వాతి తిరునాళ్ తరుచుగా తమ రచనలను శ్రీ త్యాగరాజువారికి పంపి వారి అభిప్రాయాన్ని కోరేవారట. పలు భాషలలో అనేక దేవతలపై చాలా కృతులను రచించారు. వీరు రచించిన వాటిలో నవరాత్రి కీర్తనలు చాలా ప్రముఖమైనవి. స్వరజతులు, పదములు, జావళీలు, తిల్లానాలు ఎన్నో రచించారు. హిందూస్థానీ సంగీత పద్ధతిలో దృపద్, టప్పా, ఖయాల్, ఠుమ్రీ వంటివెన్నో రచించారు.

10_015 మహనీయుల త్యాగం

1933లో గాంధీజికి శిష్యుడుగా చేరి అనతి కాలంలోనే వారికి ప్రీతిపాత్రుడైయ్యాడు శ్రీరాములు గారు. శ్రీరాములుగారి సేవానిరతికి గాంధీజి సంతసించి శ్రీరాములు వంటి కార్యకర్తలు మరో పదిమంది ఉంటే స్వాతంత్య్రం ఒక్క సంవత్సరంలో సాధించవచ్చు అన్నారు.

10_015 హోళికా పూర్ణిమ

ఫాల్గుణ మాసపు పూర్ణిమకు “ హోళికా పూర్ణిమ ” అని పేరు. దీనినే ‘ హోలీ ’ అనే పేరుతో పండుగగా జరుపుకుంటాము. దీనికే ‘ కామదహనము ’ అని కూడా పేరు. ఈ పండుగ జరుపుకోవడానికి కారణంగా చెప్పుకునే కొన్ని పురాణ గాథలలో ఒకటి – ప్రహ్లాదుని విష్ణుభక్తిని సహించలేక అతని తండ్రి అనేక క్రూరమైన శిక్షలకు గురి చేస్తాడు. దేనికీ ప్రహ్లాదుడు చలించకపోవడంతో తన సోదరి అయిన హోళికతో ప్రహ్లాదుడిని తన ఒడిలో ఉంచుకొని అగ్నిలో కూర్చొనమని ఆదేశిస్తాడు హిరణ్యకశిపుడు. హోళికకు ఉన్న వరం వలన అగ్ని ఆమెను ఏమీ చేయలేదు. కానీ చిత్రంగా ఇప్పుడు మాత్రం హోళిక దహనం అయిపోతుంది. ప్రహ్లాదుణ్ణి విష్ణువు కాపాడడంతో క్షేమంగా బయిటకు వస్తాడు.