10_016

10_016 వార్తావళి

బే ఏరియా తెలుగు సంఘం అధ్వర్యంలో “ ఉగాది సంబరాలు ”, అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి, చెన్నై వారి ‘ నెల నెలా వెన్నెల ’ “ వీరనారి ”, సర్వోదయ ఇంటర్నేషనల్ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ చాప్టర్, కాకినాడ వారి “ మహాత్మాగాంధి కాకినాడ లో అడుగిడి వందేళ్లు ” కార్యక్రమం,కృష్ణా జిల్లా రచయితల సంఘం స్వర్ణోత్సవ వివరాలు…..

10_016 ఆనందవిహారి

వేద విజ్ఞాన వేదిక, ఆంధ్రా సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్, చెన్నై సంయుక్త ఆథ్వర్యంలో “ అడవి బాపిరాజు నవలా వైశిష్ట్యం ” ప్రసంగ కార్యక్రమ విశేషాలు, హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో “ హాంగ్ కాంగ్ లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ” కార్యక్రమ విశేషాలు…..

10_016 తెలుగు సాహిత్యంలో వర్ణనలు

మహాసముద్రాన్ని పోలిన గొప్పదైన వానరసైన్యము సమీకరించబడింది. వీరులైన ఆ వానరులు అట్టహాసాలు పెద్దనురగలు లాగా అగుపిస్తున్నాయి. అంటే వానరుల నవ్వులను తెల్లని నురగలుగా వర్ణిస్తున్నాడు కవి. వానరుల పొడవైన వాలములు అంటే తోకలు పగడాల తీగలులాగా ఉన్నాయి. ఆ కపి వీరులు గొప్పవైన చేతుల సమూహాలు అనేకమైన వరహాల వరుసలలాగా ప్రకాశిస్తున్నాయి.

10_016 గురజాడ తెలుగుజాడ

“ నా కావ్య కళ నవీనం” అంటారు గురజాడ. ప్రజలకి ఉపకరించే ఉద్యమం చేపట్టి సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి సాహిత్యాన్ని ఒక ఆయుధంగా చేసుకున్నారు నాటి సంస్కర్తలు. కందుకూరి సాంఘిక సంస్కరణ, గిడుగు వ్యావాహరిక భాష ఉద్యమం గురజాడ మీద ప్రభావాన్ని చూపేయి. అందులో భాగంగా ఆ రోజుల్లో జరుగుతున్న బాల్య వివాహాలు ఆయన లో కలవరం లేపేయి. పసిబాలికలను కసాయి తల్లిదండ్రులు కన్యాశుల్కాలకు ఆశపడి అమ్మేయడం అమానుషమనుకున్నాడు.

10_016 అంతర్జాతీయంగా తెలుగు వికాసం

ప్రపంచంలో ప్రతి చిన్న, పెద్ద భాషలన్ని రక్షించుకోవాలని, భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మనం జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలమని యునెస్కో చెబుతోంది. బహుభాషల విధానాన్ని ప్రోత్సహించాలని, అది విశాల దృష్టిని, శాస్ర్తీయ దృక్పథాన్ని పెంపొందిస్తుందని యునెస్కో ప్రకటించింది. అయితే మాతృభాషను కాపాడుకుంటూనే దాని ద్వారానే ఇతర భాషల్ని నేర్చుకోవడం, అనంత విజ్ఞానాన్ని పొందడం సరైన మార్గం అని యునెస్కో వెల్లడించింది.

10_016 తెలుగింట కళాభ్యాసం

ప్రాచీన కాలంనుంచీ భారతదేశపు కుటుంబాలలో సంగీతసాహిత్యాల పట్ల ఒక ప్రత్యేకమైన గౌరవం.. భక్తి ఉన్నాయి. ప్రతి కుటుంబంలోనూ తల్లిదండ్రులు తమ పిల్లలకు సంగీతం, సాహిత్యం, నృత్యం లేదా ఇతరమైన లలిత కళలను గానీ పరిచయం చేయడంలో ఎంతో ఉత్సాహాన్ని, శ్రద్ధను కనబరిచేవారు. నా బాల్యంలో చాలా ఇళ్లలో హర్మోనియం గానీ, వీణ గానీ ఉండేవి. మంచి వారపత్రికలు, మాస పత్రికలూ దర్శనమిచ్చేవి. కొన్ని ఇళ్లలో ఎవరో ఒకరు సంగీత వాయిద్యాల్లో గానీ, గాత్రంలో గానీ శిక్షణ పొందుతూ ఉండేవారు.

10_016 తెలుగు ఉగాది వెలుగు

ఉగ్గుపాలల్లోన మొగ్గతొడిగిన భాష
జోలపాటలతోటి ఊయలూపిన భాష
తీపి తేనెల భాష ప్రేమ పంచిన భాష
ఊపిరై మన వెంట నడిచి వచ్చే భాష

10_016 ప్రవాసంలో తెలుగు అక్షరం

ఇక్కడ పుట్టి పెరుగుతున్న పిల్లలు చాలా తెలివితేటలు కలవాళ్ళు, అద్భుతంగా ఇంగ్లీషు మాట్లాడతారని సంతోషపడినా వాళ్ళ మాటా, ప్రవర్తన మన సంస్కృతి పరంగా చూస్తే, చాలా భిన్నంగా ఉండటం తల్లిదండ్రులను వ్యాకుల పరిచేది. పిల్లలకు కొంతవరకైనా మన పద్ధతులు, మన ఆచార వ్యవహారాలు తెలియాలని అందుకు గాను వారికి మన భాష తెలియాలని చాలామంది తల్లిదండ్రులు అభిప్రాయపడుతూ ఉండేవారు. అప్పటి పరిస్థితుల కారణంగా ఇంట్లో ఎవరికి వారుగా తెలుగు నేర్పడం సాధ్యం కాదని, బేస్మెంట్ ఉన్న తెలుగువారి ఇంట్లో ఆదివారాలు తెలుగు క్లాసులు మొదలు పెట్టారు.

10_016 తెలుగువారి భోజనం

శ్రీకృష్ణదేవరాయలు వారి ఆముక్తమాల్యద లో ఆ కాలంలోని భోజనపదార్థాల గురించి, అతిథులను ఆహ్వానించి ఎలా భోజనం పెడతారో అనే విషయాల గురించి ఎంతో విపులంగా రాసారు.
పోతన, తెనాలి రామకృష్ణ లాంటి వారు కూడా ఆంధ్రుల వంటల గురించి రాసారు.
భోజనం అతిథులకు వడ్డించడం కూడా ఒక గొప్ప కళ. గృహస్తు అతిథులు భోజనం చేసాకే చేయడం కూడా తెలుగు వారి సాంప్రదాయం లో భాగమే.