Category: 10_016

10_016 మహర్నవమి గడలు

మాంటిసోరీ అనే విద్యాపద్ధతిలో చిన్నపిల్లలకు ఇంచుమించు ఇదే పద్ధతిలో విద్యాబోధన జరుగుతుందని వింటున్నాం. ఇందులో పిల్లలు వారంతట వారే తమ తమ పనులనూ చేసికొనేట్లు విద్యాబోధన జరుగుతుంది. అయితే ఒకప్పటి పల్లెటూర్లలో ఇది సర్వసామాన్యమైన విద్యాపద్ధతి. పిల్లలకు సామూహికంగా పని చేయటమూ తెలుస్తుంది. కలిసి చేయటం, కలిసి వెళ్ళటం వల్ల పిల్లల మధ్య సామరస్యము, ఐకమత్యము పెరుగుతాయి. ఇలా నేర్చికొన్న పాఠం మనసుకి హత్తుకొనటంతో మరచిపోయేందుకు అవకాశం ఉండదు.

10_016 తెలుగువారి జానపద కళలు

హాలుని గాధాసప్తశతి లో ఆకాలము నాటి కళలను గురించి వివరించడము జరిగింది. అమరావతీ శిల్పాల అందాలలో మనకు ఎన్నో నాట్య భంగిమలు కనిపిస్తాయి. బౌద్ధ జాతక కథలలో నటుల గురించి సమాచారము లభిస్తుంది. దక్షిణ దేశానికి చెందిన ‘ కువలయ ’ అనే నాట్యకారిణి బుద్ధుని జీవిత విశేషాలను నాట్యముగా రూపొందించి ప్రదర్శించినట్లు తెలుస్తున్నది. ఇక్ష్వ్వాక రాజులు లలితకళలను ఎక్కువ పెంపు చెయ్యకపోయినా శాతావాహనుల కళా సంస్కృతిని కాపాడినది వీరే.

10_016 జ్ఞాపకాల మధురిమలు

మధురమయిన స్మృతులు మనకు చెరగని తరగని, సంపద. ఈ స్మృతులను మనం వేపచెట్ల చల్లని నీడలతోనూ– కొత్త తాటాకులతో నిర్మించిన పందిరులు అందించే చల్లదనం తోనూ సరిపోల్చవచ్చును.. కాలగమనంతోబాటు ఆ జ్ఞాపకాలు పాతబడవు సరిగదా మరింత ఆనందాన్ని పంచుతూ ఉంటాయి. ఆ ఆనందం మనకు దైవదత్తం అనుకుంటే, ఆ దేవుడే ఆ ఆనందాన్ని మనకు అనేక విధాలుగా సమకూరుస్తూ ఉంటాడు.

10_016 తెలుగు ఉగాది

ప్లవనామ సంవత్సరం అంటే నీటి వనరులు సమృద్ధిగా పుష్కలంగా లభిస్తాయి అని చెప్తారు. ఈ సంవత్సరంలో వాగులు, నదులు, చెరువులు, సముద్రాలు ఉప్పొంగి ప్రవహిస్తాయని పెద్దలు చెబుతున్నారు. ఈ నీటి కొరత లేకుండా ఉంటే పంటలు సమృద్ధిగా పండుతాయి. తద్వారా రైతన్నల కష్టాలకి తగిన ఫలితం దక్కుతుంది. పేదవారి క్షుద్బాధ తీరుతుంది. అప్పుడు దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది. ఇలా సుభిక్షంగా ఉండే రోజే ఉగాది.

10_016 తెలుగు వారి క్రీడా సంస్కృతి

ఎన్నో రకాల ఆటుపోట్లకు తట్టుకుని నిలబడ్డ మన భారతీయ సంస్కృతిలో ఒక భాగమైన మన తెలుగు జాతి సంస్కృతి సంప్రదాయాలకు ఒక ప్రత్యేక స్థానమున్నదనడంలో అతిశయోక్తి లేదు. మన తెలుగువారి సంస్కృతికి ప్రతీకలుగా ఉన్నవి మన కళలు. వీటితో పాటూ ఇంకా అనేకం కలగలిస్తేనే సంస్కృతి అవుతుంది. మన పండుగలు, వాటిని ఆచరించే పద్ధతులు, ప్రకృతిని పూజించే విధానం, మన కట్టుబొట్టు, వివాహాది శుభాశుభ క్రతువుల్లో గల ఆచారాలు, హస్త కళలు, వివిధ క్రీడలు ఇత్యాది అన్ని అంశాల్లోనూ మన సంస్కృతికి ఒక ప్రత్యేకత ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

10_016 అయిగిరి నందిని…

అయిగిరి నందిని, నందితమోదిని, విశ్వవినోదిని, నందినుతే
గిరివర వింధ్య శిరోధి నివాసిని, విష్ణువిలాసిని, జిష్ణునుతే

10_016 సినీ సంగీతఝరి

గత తరంలో సినీ గీత రచయితలు / త్రులు వారు డైరెక్ట్ గా సినీ గీత రచయితలవ్వలేదు. వీరిలో చాలామంది మహాకవులు. ఎన్నో కవితా గ్రంధాలని ప్రచురించారు, వీరిలో సహజకవులు, ప్రజాకవులున్నారు. కవితారంగానికి ఎంతో సేవ చేసారు. ఎన్నో బిరుదులు సంపాదించారు. ఆల్ ఇండియా రేడియోలో పని చేస్తుండగా సినీ పరిశ్రమలో అవకాశాలు రావడం, వీలయినపుడల్లా వేరే కలం పేరుతో సినీ గీతాలు, కథలు రాసేవారు. ఈ కవులు కేవలం సినీ గీత రచయితలే కాదు, స్వాతంత్ర సమరంలో పాల్గొన్నవారు. క్విట్ ఇండియా ఉద్యమంలో జైలు శిక్ష అనుభవించారు.

10_016 దైనందిన జీవితంలో సంస్కృతం

సముద్రంలోని చేపలు మత్స్యకారులకు జీవనోపాధి చూపించగా, దీని లోతుల్లోకి వెళ్ళి వెతికేవారికి రత్నాలు దొరుకుతాయి, అక్కడి ప్రాణుల జీవనశైలి తెలుస్తుంది. లోతుల్లోకి వెళ్ళక కేవలం తీరస్థులైనవారికి అందమైన అలలు నేత్రానందం కలిగిస్తాయి. ఈవిధంగానే, సారభూతమై, నిష్కర్షతో వ్యవహరించే శాసనప్రాయమైన సకల శాస్త్రాలూ సంస్కృతంలో అనుస్యూతమయ్యుండగా, లాలిత్యంతో కూడుకున్న ఎన్నో రచనలూ, అంశాలూ భాషాభిమానులను పరవశింపజేస్తాయి.

10_016 ఆంధ్ర జానపద, సంగీత, సాహిత్యాలు

జానపదుల జీవన శైలి జానపదుల సంగీత సాహిత్యాల కి వెన్నెముక వంటిది. వారి సాహిత్యం అంతటికీ వారి అనుభవాలే మూలం, వారి జీవిత అనుభవాల్ని సాహిత్యం లో సంక్షిప్తం చేసి, ప్రచార నిమిత్తం తదదుగుణమైన సంగీతాన్ని వాడుకున్నారు.
అయితే ఈ సంగీత సాహిత్యాలకీ మూలాలు శాస్త్రీయ సంగీత సాహిత్యాలవే.

10_016 లలిత సంగీతం నాడు – నేడు

ఈ లలిత సంగీతానికి గల ప్రత్యేకత ఏమిటంటే అనువైన చక్కని సాహిత్యం, దానికి తగిన సంగీతం ఉండటంతో చాలావరకూ సినిమా పాటలవలె కాక, ఏ విధమైన సంకోచమూ లేకుండా నలుగురి మధ్య కూర్చుని పాడటానికి, పాడమని అడగటానికి, వినటానికి ధైర్యంగా ఉండేది. సినిమా పాటలలో ఏవో కొన్ని తప్ప, అన్నిటికీ ఈ విధమైన అనువు, సౌలభ్యమూ లేదనే చెప్పాలి. దానికి తోడు అవి యుగళగీతాలైతే మరీ కష్టం. వీటన్నిటికీ తోడు, సినిమా పాటలను పాడే శృతులు, ముఖ్యంగా మహిళలకు, ఆడపిల్లలకూ అనుకూలంగా ఉండేవి కాదు. దానికి కావాల్సిన కంఠ పరిణతి వేరే రకపుది.