Category: 10_017

10_017 వాగ్గేయకారులు – వీణ కుప్పయ్యర్

ఏటా రెండుమార్లు వీరు రాధారుక్మిణీ సమేత శ్రీ వేణుగోపాలస్వామి వారి ఉత్సవాలు చేయించేవారట. ఈ సమయంలో ఎన్నెన్నో సంగీత కచేరీలు, గానసభలు నిర్వహించేవారు. ఇవన్నీ దైవ సన్నిధిలోనే జరిగేవిట. అటువంటి ఒక ఉత్సవ సమయంలోనే, త్యాగరాజుగారు అక్కడ ఉండటం జరిగి, వేణుగోపాలస్వామి దివ్యమంగళ విగ్రహం చూసి తన్మయత్వంతో కేదారగౌళ రాగం లోని ” వేణుగాన లోలుని గన వేయి కనులు కావలె ” అనే కీర్తనను రచించారట.