10_018

10_018 వార్తావళి

చెన్నై అమరజీవి స్మారక సమితి వారి ‘ నెల నెలా వెన్నెల ’ కార్యక్రమంలో భాగంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నిర్వహించిన 26వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతల ప్రకటన, కృష్ణా జిల్లా రచయితల సంఘం స్వర్ణోత్సవ కార్యక్రమ వివరాలు, క్లేవ్లాండ్ త్యాగరాజ ఉత్సవ వివరాలు

10_018 ఆనందవిహారి

చెన్నై లోని అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి నిర్వహిస్తున్న ‘ నెల నెలా వెన్నెల ‘ కార్యక్రమంలో భాగంగా
“ పి‌వి రాజకీయ, సాహితీ వ్యక్తిత్వం ”

10_018 రోగిష్టి సంబంధం

ఏంభయంలేదమ్మా, వాళ్ళు దోమల్ని పెంచుకుంటున్నారు. ఆ దోమలు బయట వాళ్లనే గానీ, ఇంట్లో వాళ్లని కుట్టదు! నాదీ గ్యారెంటీ. లేకపోతే పిల్లాడు ఇంకా ఎట్లా ఇప్పటి దాకా బ్రతికున్నాడు? వాళ్లకి, కట్నాలు వద్దట. Hit, Musquito bats కట్నం క్రింద ఇస్తే చాలట!

10_018 బోట్స్‌వానాలో మన పండుగలు

నదులన్నీ పర్వతాలలో పుట్టి ప్రవహిస్తాయి కదా ! అలా పుట్టి పెరిగి ఇసుకలో మాయమైపోయే నీటి ప్రవాహం ఉన్న బోట్స్‌వానా లో అతి పెద్ద మంచినీటి డెల్టా ‘ ఒకవాంగో ‘ ( Okavango ) డెల్టా. అక్టోబర్ నుంచి మే వరకు నీరు నిలిచి వేసవి రాగానే క్రమంగా మాయమైపోతుంది. నదులు సాధారణంగా సముద్రం వైపు ప్రవహించి అక్కడ కలిసిపోతే, ఇక్కడ మాత్రం ఇసుక తిన్నెలలో కలిసి పోతాయి. ఆ నీటి ధారలు ఎన్నో రకాల జంతువులకి ఆధారం. మనం ఆ నీటిలో చిన్న తెప్పలలో హాయిగా తిరుగవచ్చు.

10_018 తో. లే. పి. – ఎన్నార్ చందూర్

చందూర్ గారు మితభాషి. పెదవులపై చిరునవ్వు ఆయనకు సహజ అలంకరణము. విశ్వసాహిత్యానిపై ఆయనకు అంతులేని అవగాహన, పట్టు ఉన్నాయి.
జగతి మాస పత్రికలో ప్రత్యేక ఆకర్షణ ఆయన స్వయం గా నిర్వహించే ” జగతి డైరీ ” శీర్షిక. ఇందులో ఆయన ప్రస్తావించిన అనేక అంశాలు పాఠకుల విశేష అభిమానాన్ని చూరగొన్నాయి అనడం లో ఏమాత్రం సందేహం లేదు.

10_018 అమెరికా ఇల్లాలి ముచ్చట్లు-మన ‘వరాలు’

మా మనవరాలు మా దగ్గిర ఉన్న వారంరోజులు మా ఇల్లు దాని నవ్వులతో…..కేరింతలతో….అల్లరితో… దాని భాషలో అది పాడిన పాటలతో……సందడి సందడిగా గడిచిపోయింది! మధ్యమధ్యలో మా వారికీ మా మనవరాలికి పోట్లాటలు….యుద్ధాలు కూడా జరిగాయి దానికి మా ఇంటికి రాగానే తెలిసిపోయింది ఇక్కడ తనదే రాజ్యం అని తనే మహారాణి అని!

10_018 పాలంగి కథలు-యానాం పెళ్లి 2

పడవ అంచున కూర్చున్న శాస్త్రి తదేకంగా మెరుస్తూ కదిలే నీళ్లని చూస్తున్నాడు. అప్పటివరకూ పక్కన కూర్చుని పరాచికాలాడిన సావాసగాళ్లు ఒక్కొక్కళ్లే లేచి రొట్టెముక్క తిండానికి ఆ వైపుకి వెళ్లారు. పెళ్లయి భార్య వస్తుంది. ఆ పిల్ల మంచి అందగత్తెట. మనుచరిత్రలో చదివిన ‘‘కూకటుల్‌ కొలిచి’’ చేసిన సోమిదమ్మలా ఉంటుందా? వరూధినిలా…? అబ్బే..అలా ఉండదు. తనకిష్టమైన కాళిదాసు ‘శాకుంతలం’లో శకుంతలలా ఉంటుందా? బహుశా అలాగే ఉండి ఉండాలి. అబ్బే అబ్బే…అలాగెలా అవుతుంది? ఏమో? మనసులో ఏదో ఉద్వేగం.

10_018 కథావీధి-వడ్డెర చండీదాస్ రచనలు 2

ఈ పుస్తకం లోని శైలీ విన్యాసాల గురించి చాలా మెచ్చుకున్న పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు ఆఖర్లో ఇంత గొప్ప శైలీ విన్యాసాన్నీ ఇత్తడి చెంబు కి మెరుగు పెట్టడం తో పోల్చారు. అసలు విషయం లో సారం లేనప్పుడు నగీషీ లు రాణించవనీ, ఇంట్లో వాడే ఇత్తడి చెంబుకి మెరుగులు పెట్టినా పెద్దగా ఉపయోగం ఉండదనీ వారి భావం.