Category: 11_001

11_001 AV – దక్షిణాయనం

Dakshinayanamu – ISR

దక్షిణాయనము, ఉత్తరాయణము అనేవి సూర్యుని యొక్క గమనమును బట్టి నిర్దేశింపబడతాయి. మనం ప్రతిరోజూ ఉదయాన్నే సూర్యోదయాన్ని గమనిస్తూ వచ్చినట్లయితే రోజు రోజుకూ సూర్యుడు ఉదయించే దిశలో మార్పుని స్పష్టంగా గమనించవచ్చును.

11_001 హాస్యగుళికలు – పెళ్లి పండుగ – ఖర్చు దండగ

Hasya gulikalu – Pelli Panduga Kharchu dandaga

Destination wedding అని. నువ్వు చెప్పిన సంగీత్, మెహందీ, స్టార్ హోటళ్ళు, గార్డెన్స్, ఇవన్నీ ఇప్పుడు మామూలైపోయాయి. అదే కాస్త వెరైటీగా మన సొంత ఊరిలో మన సొంత ఇంట్లో మూడు రోజుల కార్యక్రమాలు.. ఏవి? నువ్వు చెప్పినవన్నీ చేద్దాం. ఇంటిముందు హాయిగా తాటాకు పందిళ్ళు వేసి ఘనంగా నీ పెళ్ళి జరిపిద్దాం.

11_001 మా యూరోప్ పర్యటన – జర్మనీ

Maa Europe Paryatana – Germany

ప్లాజాలో తిరుగుతుండగా నా చీర, బొట్టు చూసి ఒకతను సంజ్ఞలు చేస్తూ ఏదో మాకు తెలియని భాషలో అడుగుతూ మాటలు కలిపాడు. అతన్ని తప్పించుకుని ఓ షాప్ లోకి వెళ్ళగానే ఫోటో రీలు కొనడానికి పర్స్ కనబడలేదు. బాక్ పాకెట్ లోంచి మాయం. అతి లాఘవంగా ఆ ఆగంతకుడు లాగేశాడు మావారి దగ్గర.

11_001 అమ్మ – అవని

Amma – Avani

పొలితీన్ తోని పశువుల పానాలు
కాలుష్యం తోని మనుషుల పానాలు
ఇట్టే లాగేసి, నగరీకమంటూ,నగుబాటు లేకుండా పేరెట్టినావు
ఎంత వెర్రి నీకురా ఓ మనిషి

11_001 మాలతీ సాహితీ మధువు

Malathi sahitee madhuvu
ఆంధ్రప్రభ సచిత్రవార పత్రికలో “ప్రమదావనం” పేరిట కాలమిస్టుగా తెలుగు ప్రమదల జీవితాల్లో వెలుగులను నింపిన నిరంతరాన్వేషి మాలతీ చందూర్. కుట్లు, అల్లికలు, వంటలు, వ్యక్తిగత, సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక, సంప్రదాయాది అంశాలపైన అడిగిన అన్ని ప్రశ్నలకి నిక్కచ్చిగ, నిబద్ధతతో ఆమె ఇచ్చే సమాధానాల కోసం తెలుగు మహిళా లోకం ఎంతో అత్రుతగా పడిగాపులు గాచేది. తెలుగింటి ఆడపడుచుల కష్టాలకొక కల్పలతగా భాసిస్తూ ప్రమదావనం సుమారు 50 ఏళ్ళ పాటు ఆంధ్ర మహిళలను అలరించింది.

11_001 అమెరికా ఇల్లాలి ముచ్చట్లు – వంటింట్లో ఆడవాళ్ళు

America Illali Mucchatlu – Vantitlo Adavallu
ఇంటిపట్టున ఉండే ఆడవాళ్లకు, అందులోనూ వంటలు చేసుకునే ఆడవాళ్లకు ఏమి తెలియదని, లెక్కాడొక్కా రావని వెనకటి రోజుల్లో వాళ్ళను చిన్న చూపు చూసేవారు. నిజానికి వాళ్లకుండే తెలివి తేటలు, సామర్ధ్యం ముందు, చదువుకున్న వాళ్ళు, బయట తిరిగే మగవాళ్ళు ఎందుకూ పనికి రారు. మా ఊళ్ళో వంటింట్లో ఉంటూనే ఊళ్ళేలిన ఆడవాళ్ళు బోలెడంత మంది ఉన్నారు.

11_001 కథావీధి – వడ్డెర చండీదాస్ రచనలు – అనుక్షణికం 4

వేంకటావధాని కి జయంతి క్లాస్ మేట్ కాదు కానీ ఇద్దరూ ఒకటే కాలేజ్. పెళ్ళి అయిన తరువాత జయంతి గురించి చూచాయ గా విన్న మాటలు అవధాని లో ముందు ఉన్న అనుమానాలను పెంచి పోషిస్తాయి. మింగలేకా, కక్క లేకా ఉన్న అతని పరిస్థిని గమనించిన జయంతి అతనికి ఏ లోటు రాకుండా ఇంటి పనీ, బయట పనీ తానే చేసుకుంటూ అతకి ఎటువంటి వంకలూ పెట్టడానికి అవకాశం ఇవ్వకుండా ఉంటూ ఉంటుంది.

11_001 మా భారత జనయిత్రి

Bala Bharathi – Maa Bharata Janayitri

గంగా తరంగాల సంగీత భంగిమలు మా తల్లికి నిరంతరం మంగళ గానం!
ఉరకులతో పరుగులతో ఉప్పొంగే నదీజలం స్పందించే తల్లి ఎడద అందించే రాగరసం!

11_001 భరతమాత

Bharatamatha
భారతం వెలిసింది
భాగవతం మెరిసింది
కావ్యాలు ధ్వనించాయి
పురాణాలు పుట్టాయి