11_003

11_003 ఆనందవిహారి

అక్టోబర్ 2వ తేదీ గాంధీజయంతి రోజున విజయవాడ ఎం. బి. విజ్ఞాన కేంద్రం ప్రక్కన ఉన్న బాలోత్సవ్ భవన్ లో జరిగిన “ తూమాటి వరివస్య ”, “ కందుకూరి కావ్యద్వయము ” పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమ విశేషాలు….

11_003 పాకశాల

తెలుగు వారి వంటలు ప్రత్యేకమైనవి. రుచికరమైనవి. ఆయా ప్రాంతాలకే ప్రత్యేకమైనవి కూడా ఉన్నాయి. వాటిని పరిచయం చేస్తూ, తయారు చేసే విధానాన్ని వివరిస్తూ సాగే “ పాకశాల ” లో దసరా సందర్భంగా ఒక తీపి వంటకం “ ఆగ్రా పేట ( బూడిదగుమ్మడికాయ హల్వా ) ”, మరొక పులిహొర రకం “ పెసరపొడి పులిహోర ” ల గురించి……

11_003 తూరుపు తల్లి

సి. ఇందిరామణి గారి స్వరకల్పనలో వడ్డేపల్లి కృష్ణ గారు రచించిన గీతం “ తూరుపుతల్లి ” పద్మజ శొంఠి స్వరంలో….

11_003 పెళ్ళికి రండి – ఆనందం ఈవేళ

అమ్మాయిని పెళ్ళికూతుర్ని చేసేటప్పటి పాట ఆనందం ఆనందం ఈవేళ పిల్ల పెళ్ళికూతురాయె ఈవేళ నిను పెళ్ళికూతుర్ని చేసేటి శుభవేళ తోడ పెళ్ళికూతురితో మురిసేటి ఈవేళ ఆనందం…. నీ పెళ్ళిపనులింట ఉత్సాహమే నింప నీకు కానుకలిచ్చి ఎల్లరు దీవింప ఆనందం… ఆయురారోగ్యములతో పసుపుకుంకుమలతో నీవు కలకాలం వర్ధిల్లు ఆనందం ఇనుమడింప ఆనందం…

11_003 నను గన్న తల్లి….

సంగీత కళాకారిణి, సంగీత చికిత్సా నిపుణురాలు కాళీపట్నం సీతా వసంతలక్ష్మి గారు సింధు కన్నడ రాగంలో, అది తాళంలో ఆలపించిన త్యాగరాజు కీర్తన “ నను గన్న తల్లి…. ”.

11_003 తాళ్ళపాక అన్నమాచార్య కళాభిజ్ఞత

అమెరికా చికాగొ నగరంలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా భారతీయ సాహిత్యం, కళలకు సేవలందిస్తున్న శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా వ్యవస్థాపకులు డా. శారదాపూర్ణ శొంఠి గారి “ తాళ్ళపాక అన్నమాచార్యుని సంగీత, నృత్య కళాభిజ్ఞత ” గురించిన సోదాహరణ ప్రసంగ పరంపర లో మొదటి భాగం….

11_003 నను బ్రోవమని చెప్పవే

ద్విభాష్యం నగేష్ బాబు గారి వీణ లో పలికించిన “ ది స్వర ఆఫ్ రామదాసు ” ఆల్బం నుంచి మిశ్రచాపు తాళం, కళ్యాణి రాగంలో రామదాసు కీర్తన “ నను బ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి ” కుమారి లక్ష్మి అభినయంలో…..