11_005

11_005 AV వార్తావళి

బే ఏరియా తెలుగు సంఘం అధ్వర్యంలో నిర్వహించనున్న దీపావళి సంబరాలు, నాటా ( NATA ) వారి ‘ పాఠశాల ’ వివరాలు…

11_005 AV ఆనందవిహారి

భారత ఉపరాష్ట్రపతి గౌ. ముప్పవరపు వెంకయ్య నాయుడు గారిచే వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి 100వ ప్రచురణ ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమ విశేషాలు, హాంగ్‌కాంగ్ లో దసరా కబుర్లు ….

11_005 AV పాకశాల – సొరకాయ తప్యాల పిండి

తెలుగు వారి వంటలు ప్రత్యేకమైనవి. రుచికరమైనవి. ఆయా ప్రాంతాలకే ప్రత్యేకమైనవి కూడా ఉన్నాయి. వాటిని పరిచయం చేస్తూ, తయారు చేసే విధానాన్ని వివరిస్తూ సాగే “ పాకశాల ” లో తెలంగాణ ప్రాంతంలో ప్రాచుర్యంలో ఉన్న “ సొరకాయ తప్యాల పిండి “ అనే వంటకం గురించి శ్రీదేవి రమేష్ లేళ్ళపల్లి వివరణ…..

11_005 AV – కొలువైన బంగారుతల్లి

సి. ఇందిరామణి గారి స్వరకల్పనలో ఆలపాటి గారు రచించిన గీతం “ కొలువైన బంగారుతల్లి ” …. సి. ఇందిరామణి గారు, వారి విద్యార్థులు ( రాగసుధ, హైదరాబాద్ ) స్వరంలో….

11_005 AV పెళ్ళికి రండి – అబ్బాయి పెళ్ళి

అబ్బాయిని పెళ్ళికొడుకుని చేసేటప్పటి పాట.
ఆనందం ఆనందం ఈవేళ అబ్బాయి వరుడైన ఈవేళ నిను పెళ్లికొడుకుని చేసేటి శుభవేళ తోడ పెళ్లికొడుకుతో అలరారు ఈవేళ ఆనందం…. పెళ్ళిపనులు చురుకుగా సాగేటి ఈవేళ బంధువులు స్నేహితులు కలిసేటి శుభవేళ ఆనందం… అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యములతో కలకాలం సుఖముగా నీవు వర్ధిలవయ్యా ఆనందం…

11_005 AV అష్టలక్ష్మి స్త్రోత్ర రత్నమాల

సంగీత కళాకారిణి, సంగీత చికిత్సా నిపుణురాలు కాళీపట్నం సీతా వసంతలక్ష్మి గారు స్త్రోత్ర రత్నమాల లో లక్ష్మీదేవి రూపాలైన అష్టలక్ష్ములను కీర్తిస్తూ ఆలపించిన …..

11_005 AV తాళ్ళపాక అన్నమాచార్య కళాభిజ్ఞత 02

సంగీతానికి గమ్యం ఎప్పుడూ కూడా సహృదయ, సామాజికుని మనస్సును రసానందభరితం చెయ్యడమే ! ఆ రసానంద సిద్ధి అనేది చిరంతనమూ, సనాతనమూ, సదాతనము. దానికి ప్రధానాంశాలు నాదమూ, గానమూ, సాహిత్యము. ఈ రసానంద విశ్లేషణకి ఈ అంశాల విశ్లేషణ చాలా ముఖ్యం…..

11_005 AV గోదావరి వైభవం

ద్విభాష్యం నగేష్ బాబు గారి నిర్వహణ లో 11 వీణలతో స్వరపరచిన “ గోదావరి వైభవం ” వాద్య బృందం…..

11_005 AV అష్టవిధ శృంగార నాయిక

ప్రముఖ నృత్య కళాకారిణి అచ్యుతమానస “ కూచిపూడి నృత్యాభినయ వేదం – మోక్ష మార్గం ” పేరుతో మహనీయులు శ్రీశ్రీశ్రీ చిన జియ్యర్ స్వామి, శ్రీ విశ్వంజీ స్వామి, ప్రముఖ దర్శకులు పద్మశ్రీ కళాతపస్వి కె. విశ్వనాథ్, శ్రీ ఘంటా శ్రీనివాసరావు, వి. ఎన్. విష్ణు ( ఐ‌ఏ‌ఎస్ ) చేతుల మీదుగా విడుదల చేసిన డి‌వి‌డి సంకలనం నుంచి……

11_005 AV నీరాజనం

ఏడు కొండలపైన వెలసి ఉన్నావయ్య
తరలి రారా తండ్రి తరలి రమ్మిపుడే
నా హృదయమే నీకు నెలవుగా జేసెదను
నా తలపు కుసుమాల మాలలే వేసేదను