11_006
11_006 – ఆనందవిహారి
చెన్నై, అమరజీవి స్మారక సమితి ఆధ్వర్యంలో ‘ నెల నెలా వెన్నెల ‘ కార్యక్రమంలో భాగంగా “ వృద్ధాప్యంలో సమస్యలు – తీసుకోవలసిన జాగ్రత్తలు ” విశేషాలు……..
11_006 – కూచింత కాఫీ
చిత్రకారుడు ‘ కూచి ’ కుంచె నుంచి జాలువారిన కాఫీ హాస్య, వ్యంగ్య గుళికలు…… కొన్ని… .
11_006 – మా ఈజిప్ట్ పర్యటన
చాలామంది ఫారో రాజులు, రాజ వంశాల ఖననం 18వ, 20వ శతాబ్దాలలో ఇక్కడే జరిగింది. 18 సంవత్సరాల వయసు కలిగిన టూటంక మున్ ( 1336 – 37 BC) మమ్మీ ఈ మధ్యనే కనుగొన్నారు. ప్రదర్శనలో పెట్టారు. ఇక్కడ 62 గోరీలు ఉన్నాయి. 1922 లో కనుగొన్న ఈ ‘ సమాధుల సమాహారం ’…. అవును… ఈ పేరు నేనే పెట్టాను
11_006 హాస్యగుళికలు – తానొకటి తలిస్తే…
కూతురికి పెళ్ళీడు రాగానే వరాన్వేషణ ఆరంభించింది వర్ధనమ్మ. ఆవిడ “ఆశకి అంతులేదు!” “గంతకు తగ్గ బొంత” సంబంధాలకి “నో” చెప్పేసింది. “ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికెగిరినట్లు” హై క్లాస్ సంబంధాలకని వెళ్ళి భంగపడింది. స్వయానా తన ఆడపడుచే సంబంధం కలుపుకుందామని వస్తే “నక్కకీ నాగలోకానికీ పొత్తేమిటి?” అని పంపేసింది. వచ్చిన సంబంధాలకి వంకలు పెట్టడంతోటే సరిపోతుంది ఆవిడకి!
11_006 – శిక్ష – శిక్షణ
స్కూల్ ఎవుడు ఒక శిక్ష కాదు.. శిక్షణ మాత్రమే,.. అల్లరి చేస్తే స్కూల్ కి పంపుతా, టి. వి. చూడడం ఆపకపోతే హాస్టల్ కి పంపిస్తా.. హోంవర్క్ చేయకపోతే ట్యూషన్ కి పంపిస్తా.. నెగెటివ్ వైబ్రేషన్ వున్న మాటలు ఇవి. పసి మనసుల్లో స్కూల్ పట్ల చదువు పట్ల ఒక ఆహ్లాదకరమైన భావన నింపటం మన అందరి బాధ్యత. సామాజిక బాధ్యత.
11_006 తో. లే. పి. – మోహన్ కుమాసురు
మాట మహత్తరమైనది.. మనుషులను దగ్గర చేసినా, దూరం చేసినా దాని ప్రభావాన్ని మాత్రం ఎవరూ కాదనలేరు. ఇది సత్యం !
నా విషయానికి వస్తే ఆ ‘మాటే’ నా మనసును అనేకమంది మహనీయుల మనసులకు చేరువచేసి, అపారమైన వారి అభిమానాన్ని నాకు ప్రసాదించింది. నిజానికి వారితో ఏర్పడిన మైత్రీ బంధం విడదీయరానిది. ఆజన్మాంతం ఆ తీపి జ్ఞాపకాలు నిలిచేలా ఆ బంధం ఏర్పాటు చేసింది.
11_006 ద్విభాషితాలు – వధువు వాగ్దానం
ఈ అవనిపై కరడుగట్టిన.. పురుషాధికారంతో..
నన్ను అణగద్రొక్కే..
అహంకారిగా కాక..
సమభావంతో ఆదరించే సంస్కారాన్ని
నీలో దర్శించాలనుకొంటున్నాను.
నీ నిరంతర స్నేహంలో..
సేద తీరాలనుకొంటున్నాను.
11_006 సప్తపర్ణి కథలు – ప్రేమ
ఒక వైపు వాంఛ, మరొక వైపు ధర్మంగా ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న మధనం’ ప్రేమ’.
అంతరంగాల్లో ఉండే ప్రేమ సద్భావం . దోషం కాదు.
దానిని శాంతిగా మలచడం ఒక సంస్కారం.
వ్యక్తిప్రేమ విశ్వగతిగా నడిపించ గలగడం కొందరు చెయ్యగలరు.
ఒక జీవన ధోరణి ఉంటుంది. ఔదార్యం ధీరత ఉంటాయి.
లౌకిక భావం ఆధ్యాత్మిక సంపత్తిగా మారుతుంది.
11_006 అమెరికా ఇల్లాలి ముచ్చట్లు – పరీక్ష
అడుగు పెడుతూనే ఇక్కడ ఎలా ఉండాలో.. ఎలా మాట్లాడాలో… ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవడంతో మొదలయ్యేవి ప్రాధమిక పరిక్షలు. తల్లీ తోడు లేని దేశంలో భయాన్ని…దిగులుని దిగమింగుకుని, ఒంటరిగా పిల్లల్ని సాకటం బెంగతో కూడిన పరీక్ష.
చిన్నవయసులోనే అన్నింటికీ “వై యామై డుయింగ్…వై డు అయి హావ్ టు డు?” అంటూ యక్ష ప్రశ్నలేసే పిల్లలకు సమాధానం చెప్పటం “బుర్ర గోక్కునే పరీక్ష”.
పిల్లలు కాస్త పెద్ద వాళ్ళయిన తర్వాత అన్నీ తమకే తెలుసుననుకుని వాదించే వాళ్ళతో గెలవటం “బుర్ర తినేసే పరీక్ష”.