11_008

11_008 – వార్తావళి

అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి ‘ నెల నెలా వెన్నెల 21 ’ లో భాగంగా “ స్త్రీల సాహిత్యంలో ప్రతిఫలించిన దేశ స్వాతంత్ర్యోద్యమ స్పూర్తి ” ప్రసంగ కార్యక్రమం, నార్త్ అమెరికా తెలుగు సంఘం వారి “ బాలల సంబరాలు ”, తానా ( TANA ) వారి “ పాఠశాల ” వివరాలు …

11_008 – ఆనందవిహారి

చెన్నై, అమరజీవి స్మారక సమితి ఆధ్వర్యంలో ‘ నెల నెలా వెన్నెల ‘ కార్యక్రమంలో భాగంగా “ ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం – విహంగ వీక్షణం ” ప్రసంగ కార్యక్రమం, మద్రాసు విశ్వవిద్యాలయం లో జరిగిన “ మట్టిలో పుట్టిన కథలు ” పుస్తకావిష్కరణ విశేషాలు……..

11_008 – కూచింత కాఫీ

చిత్రకారుడు ‘ కూచి ’ కుంచె నుంచి జాలువారిన కాఫీ హాస్య, వ్యంగ్య గుళికలు…… కొన్ని… .

11_008 – అంతర్వాహిని

తనంతట తానుగా వచ్చే తన జ్ఞాపకం తనలానే నా హృదయపు లోతుల్లో జారిపోవటం నాకు అనుభవమే అంతకుమించి నా ఆలోచన పరిధిలోకి తనని నేను ఎప్పుడు రానివ్వలేదు కానీ ఇన్ని సంవత్సరాల తరువాత ఇప్పుడు రాలేని తన జ్ఞాపకాన్ని నేను వెలికి తీస్తున్నాను.. ఓడిపోవడానికి సిద్ధం అయ్యానా ?

11_008 హాస్యగుళికలు – అమ్మ నిక్కు – అమ్మాయి జర్కు

మీ స్టేటస్ కి తగినట్టుగా ఒంటికాయ సొంటికొమ్ము లాంటి సంబంధం ఒకటుంది. ఇంటి పేరు జగడాలవారు. అబ్బాయి పేరు జగదీశ్. అనకూడదు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ, నాన్న ఎంత పుణ్యాత్ములో! కోడలి చేత చీవాట్లు, దెప్పులు తినకుండా పాపం ఈమధ్యే కాలం చేశారు.

11_008 – ఋతువైరం

చూడగనే, నను చూడగనే
నభమున ఆ రేడు ఈడేరెనే
జాబిల్లి, తారలు ఆటాడెనే
ఇక ఆటాడెనే, ఆటాడెనే ఇక ఆటాడెనే ||

11_008 – తో. లే. పి. – ఎక్కిరాల అనంతకృష్ణ

అయన హిందూ కళాశాల, గుంటూరు లో తెలుగు విభాగం లో ఉపన్యాసకులుగా పనిచేసేవారు. దాదాపు అదే సమయంలో, అనగా 1957-58 సంవత్సరంలో నేను అదే కళాశాల లో ప్రీ యూనివర్సిటీ కోర్సు చదివే విద్యార్థి ని. శ్రీ కృష్ణమాచార్య మాస్టారు మాకు ఉపవాచకం గా నిర్దేశింపబడిన కవిసామ్రాట్ శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారు రచించిన ఏకవీర ను బోధించేవారు. మాష్టారు పాఠాన్ని బోధించే తీరు, దాని విశ్లేషణ మమ్మల్ని ఎంతగానో ఆకర్షించేవి .. ఈ రకం గా ఆనాడే వారంటే ఒక ప్రత్యేకమైన భక్తి భావం, ప్రేమ ఏర్పడ్డాయి.

11_008 సప్తపర్ణి కథలు – ప్రయాణం

అనుభవాల్లో కాయికాలకంటే మానసికాలు మెరుగు. మానసికాలకంటే హార్థికాలు ఉత్తమం. అవే ప్రధానం. కాయికాలూ, మానసికాలూ, హార్థికాలూ, ఆధ్యాత్మికలూ అంటూ ఏమిటివన్నీ ? కాస్తంత సంస్కృత భాషా వాసనలున్న వాడికే అర్థమయే మాటలు. మిగిలిన భాషల వాళ్లకి ఇన్ని తరగతులున్నాయా ? ఏమో !! ఉండే ఉంటాయి వేరే పేర్లతో.