Category: 11_010

11_010 దేవతలు – గ్రామదేవతలు

గ్రామదేవతలు భారతదేశమంతా ఉన్నారు. ఒక్కొక్క చోట వీరిని ఒక్కో పేరుతో పిలుస్తారు. వీరు ఎక్కువగా శక్తిస్వరూపిణులు కనుక స్త్రీదేవతలు. అయితే గ్రామానికి రక్షకులుగా ఉండే మగదేవతలు కూడా ఉంటారు. వీరు క్షేత్రపాలకుల కోవకి చెందినవారు. కాలభైరవస్వరూపులుగా వీరిని పూజిస్తారు.

11_010 ముకుందమాల – భక్తితత్వం 04

భగవంతుని ఆరాధించడం జన్మించిన ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఆలోచన, ఆచరణ మొదలైనవి వరంగా గల మానవజన్మనిచ్చినందుకు కృతజ్ఞతాపూర్వకంగా ఆ తండ్రిని అర్చించుకోవాలి. అంతేకాని కేవలం ఐహికమైన కోరికల కోసం అంతటి దేవుని ప్రార్ధించడం అవివేకమే అవుతుంది. అందుకే కులశేఖరులు ఈ జన్మలోనే కాదు అన్ని జన్మలలోనూ స్వామి పాదపద్మాలను మరువకుండులాగు వరం ప్రసాదించమంటున్నారు.