11_012

11_012 భక్తి విప్లవకారులు – భగవద్రామానుజులు

అర్జునుని నెపంగా చూపిస్తూ సర్వమానవాళికి కర్తవ్య పాలనను, మానవుడు ఆచరించాల్సిన ధర్మాన్ని జగద్గురువుగా బోధించినా అర్జునుడు సైతం ఆ సమయానికి తనలో ఉన్న అజ్ఞానం తొలగించుకున్నా యుద్ధరంగంలోనే మళ్ళీ భవబంధాలకు కట్టుబడి, అహంకార మమకారాలకు లోనై ధర్మం తప్పి ప్రవర్తించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. సకల చరాచర సృష్టి కారకుడైన పరమాత్మే స్వయంగా బోధించినా మనిషి పూర్తిగా ధర్మవర్తనుడు కాలేకపోయాడు అంటే అతిశయోక్తి కాజాలదు. మాయ మనిషిని అలా కమ్మేస్తుంది.

11_012 ముకుందమాల – భక్తితత్వం

ఉత్తముడైన భక్తుని యొక్క మనసు ఏకాగ్రతతో పూర్తిగా భగవంతుని పాదాలపై లగ్నమై ఉండాలి. ఆ భావం ఒక సమయంలో ఉండటం మరొక సమయంలో లేకపోవడం కాకూడదు. ఏదో పూజా సమయంలోనూ, సంకీర్తన సమయంలోనో భగవంతుని గురించి స్తుతించడం పూజించడం కాకూడదు. అంతేకాదు స్వర్గ సుఖాల్లో తేలుతున్నా వేదనలో వేగిపోతున్నా భగవంతుని భావనలో మనసు ఆ స్వామి పాదాలనే పూర్తిగా ఆశ్రయించుకుని ఉండాలి.