11_013AV
11_013AVదేవీ వైభవం – సౌభాగ్యలక్ష్మి
జగములన్నిటి చేత మన్నింపబడే ఇల్లాలు. తామరలందు ఉండేది ముద్దరాలు. ఆ తల్లి చంద్రుని తోబుట్టువు. చల్లదనం, ప్రకాశం, ఆనందం, ఆహ్లాదం… వీటన్నిటికీ నెలవు చంద్రుడు. ‘ మ ‘ అంటే తల్లి లక్ష్మీదేవి. ఆమె తోబుట్టువు చంద్రుడు. అందుకే మనందరికీ మామ. వెన్నెలలోని చల్లదనం ఎలాంటివారికైనా మనసుకు హాయిని నింపుకొక మానదు. అటువంటి చంద్రుని తోబుట్టువైన, మన మనసేరిగి కోరికలు తీర్చే వరాలలక్ష్మి. లక్ష్మీదేవి శక్తితో కలిసి ధైర్యలక్ష్మి గాను, జయలక్ష్మీగాను, ఇంకా సరస్వతితో కలిసి విద్యాలక్ష్మి గాను భాసిస్తుంది.
11_013AV మీనాక్షీ పంచరత్న స్త్రోత్రం
సుందరేశ్వరుని భార్యయైనది, భయము తొలగింపచేయునది, జ్ఞానము నిచ్చునది, నిర్మలమైనది, నల్లని కాంతి కలది, బ్రహ్మదేవునిచే ఆరాధించబడునది, నారాయణుని సోదరియైనది, వీణ- వేణు- మృదంగవాద్యములను ఆస్వాదించునది, నానావిదములైన ఆడంబరములు కలది, దయాసముద్రమైనది అగు మీనాక్షీదేవిని నేను ఎల్లప్పుడు నమస్కరించుచున్నాను.