11_014

11_014 కనువిప్పు

మనం చదువుకొన్న మనుష్యులమైనా ప్రకృతితో సంబంధం కలుపుకోక – ఏవో సమస్యలతో బుర్రలు బ్రద్దలు చేసుకొంటూ వుంటాం. వివేకం అనేది మనిషి జీవితానికి జ్యోతిలా దారి చూపిస్తుంది.

11_014 ముకుందమాల – భక్తితత్వం

భగవానుని యందు నిరతిశయ ప్రీతి భక్తి. ఈ భక్తికి ధర్మార్ధ కామమోక్షాలు పొందాలనే కోరిక లేదు. కర్మనాశంకాని, నరక నివారణ కాని, త్రిగుణాతీత స్థితి యందుండటం కాని అపేక్షితాలు కావు. భక్తి భక్తి కోసమే. అది ఒక్కటే పరమ పురుషార్ధం. ఈ భక్తి సర్వావస్థల యందూ, ఆత్మ ఉండేంత వరకూ ఉండవలసినదే. ఒకప్పుడుండి మరొకప్పుడు పోయేది కాకూడదు. ఆ భక్తి ఈ జన్మలో మరణ సమయంలో జన్మాంతరాలలో ఎప్పుడూ ఉండవలసిందే! దీనినే ఆత్యంతిక భక్తీ, ఏకాంతిక భక్తీ అంటారు.