11_016&017

11_017AV వార్తావళి

సప్నా సంస్థ ఆధ్వర్యంలో ‘ రాగప్రభ ” అంతర్జాతీయ అష్టాదశ వీణా ఉత్సవ్ విశేషాలు, ఉత్తర అమెరికా తెలుగు సంఘం నిర్వహిస్తున్న “ మాతృదినోత్సవ ” వివరాలు, బే ఏరియా తెలుగు సంఘం (BATA) వారి సంగీత విభావరి, ఇండో అమెరికన్ సంఘం నిర్వహిస్తున్న “ మాయాబజార్ ”, అమరజీవి స్మారక సమితి వారి నెల నెలా వెన్నెల కార్యక్రమంలో భాగంగా “ తంత్రీ వాద్య సంగీత విభావరి ” వివరాలు….

11_017AV ఆనందవిహారి

చెన్నై, అమరజీవి స్మారక సమితి అధ్వర్యంలో నెల నెలా వెన్నెల కార్యక్రమంలో భాగంగా “ అమెరికాలో తెలుగు కథా సాహిత్యం – పుట్టుక, పురోగతి, భవిష్యత్తు ”; హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన ఉగాది వేడుకల విశేషాలు….

11_017AV పెళ్ళికి రండి – మిస్ నుండి మిసెస్…

జోశ్యుల ఉమ, జోశ్యుల శైలేష్ ల స్వరకల్పన, ఉమా శ్యాంసుందర్ మరియు లక్ష్మి రామసుబ్రహ్మణ్యం గానంలో సరదాగా సాగే తెలుగు వారి పెళ్లిపాటల సంకలనం “ పెళ్ళికి రండి ” నుంచి……

11_017AV ఎంత బాధ చెలి…

ప్రముఖ సంగీత దర్శకుడు బండారు చిట్టిబాబు గారు స్వరపరచిన భావకవి దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారి రచన ఆకాశవాణి ‘ బి ’ హై గ్రేడ్ కళాకారిణి నీరజ విష్ణుభట్ల స్వరంలో…..

11_017AV తక్కువేమి మనకు – రామదాసు

ద్విభాష్యం నగేష్ బాబు గారు తన శిష్యులతో కలిసి చేసిన స్వరవిన్యాసం – మధునాపంతుల సత్యనారాయణమూర్తి గారి రచనలో వచనం పెండ్యాల సుబ్బారావు గారి గళం లో సౌరాష్ట్ర రాగం, అది తాళంలో సాగిన భక్త రామదాసు కీర్తన …..

11_017AV నంద నందన గోపాలా – తరంగం

నంద నందన గోపాలా జయ
నవనీత చోర గోపాలా
కందర్ప శత కోటి సుందర సుఖాకార మందహాస శ్రీ గోపాలా
బృందావన గోబృంద యమునానంద చంద్రనన శ్రీ గోపాలా

11_017AV ఒకపరి ఒకపరి….

మరొక లోకప్రియమైన అన్నమయ్య పదం…ఖరహరప్రియ రాగంలో…గుర్గావ్ ఎపిసెంటర్ లో అన్నమాచార్య 6 వ శతజయంతి ఉత్సవాల సందర్భంగా, వసంతలక్ష్మి గారి కచేరిలో మరొక కృతి.

11_017AV తాళ్ళపాక అన్నమాచార్య కళాభిజ్ఞత 08

అన్నమయ్య తన పాటకు తోడుగా ఉపయోగించిన వాద్యాలలో ముఖ్యంగా నాలుగు రకాలున్నాయి. అందులో వీణ వంటి తంత్రీ వాయిద్యాలు, మృదంగం వంటి చర్మ సంబంధిత వాయిద్యాలు, వాయువు ఆధారంగా పనిచేసే నాదస్వరం, వేణువు వంటి వాయిద్యాలు, లోహంతో తయారైన తాళం వంటి వాయిద్యాలు ఉన్నాయి. వీటి గురించి తన పాటలలో ప్రసవిస్తారు అన్నమయ్య

11_017AV శ్రీ ఆంజనేయ దండకం

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
ప్రభా దివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం
భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం
భజే సూర్య మిత్రం భజే రుద్రరూపం