11_020

11_020 ఆనందవిహారి

అమెరికాలో “ వాగ్గేయకారోత్సవం ”, చెన్నై, అమరజీవి స్మారక సమితి అధ్వర్యంలో నెల నెలా వెన్నెల కార్యక్రమంలో భాగంగా “ అద్వితీయం – నటత్రయం ” విశేషాలు….

11_020 చేతికొచ్చిన పుస్తకం 05

“ గోపీచంద్ ఆర్ట్స్ 4 ”, “ గణాంక శాస్త్రమే ఊపిరిగా – సి. ఆర్. రావు జీవితం: కృషి ”, “ కనకపుష్యరాగం ”, “ మదరాసు బదుకులు ”, “ భారత రాజ్యాంగ నిర్మాణంలో నారీమణులు ” పుస్తకాల గురించి….

11_020 విధి విన్యాసం

నేను నవీనకు ఇల్లంతా చూపిస్తూ, నా గదిలోకి తీసుకు వెళ్ళాను. అక్కడున్న ఫోటోను చూసి నవీన ఉలిక్కి పడింది. “ ఆ ఫోటో ఎవరిది? ” అని నన్ను అడిగింది. “ అది నా పెళ్లి ఫోటో ” అన్నాను. “ మరి ఇందాక మీ భార్యను పరిచయం చేశారు కదా! ” అని అడిగింది.

11_020 బడాయిలు – బఠానీలు

పూర్వం పెళ్లిళ్లలో వడ్డనలు చేసేటపుడు పులుసుకు, చారుకు, పచ్చళ్ళకి, నేటికీ ప్రత్యేకమైన ఇత్తడి సామాను ఉండేవి. పచ్చళ్లు, పొళ్ళు నాలుగు రకాలు వుంటాయి కదా ! ఒక్కొక్కటి పుచ్చుకు నాలుగుసార్లు తిరగకుండా ఒకేసారి వడ్డించేందుకు పచ్చళ్ళ గుత్తి వుండేది. ఇత్తడి గిన్నెలు కళాయి పెట్టినవి 4 కలిపి వుండి ఒక హ్యాండిల్ వుండేది. ఆ పాత్రతో పాటు పులుసు పోసే పాత్ర గుర్తుకు వచ్చింది. లోతు ఎక్కువ గిన్నె గుండ్రంగా వుండేది. దానికి ఒక పక్క పక్షి ముక్కు ఆకారంగా వుండేది. గిన్నె పైన హ్యాండిల్ వుండేది.

11_020 తో. లే. పి. – భానుమతి సింగ్

అంబికా సింగ్ పూర్వీకులు పంజాబ్ రాష్ట్రవాసులు. కాగా దశాబ్దాల క్రితమే వారు ఆస్ట్రేలియా కు సమీపాన ఉన్న ఫిజి దీవులకు వలస వెళ్లారు. అక్కడ చెరుకు పొలాలలో పని చేసుకుంటూ జీవనాన్ని సాగించే వారు. అంబికా సింగ్ ఫిజి దీవుల రాజధాని లబాసా నగరం లో తన శ్రీమతి భానుమతి సింగ్ థోమ్ కలిసి మౌనిదేవో ఇండియన్ స్కూల్ ని స్థాపించి నిర్వహిస్తూ వచ్చారు. భారతీయ సంస్కృతి ని అక్కడకు ఆ రకంగా వ్యాప్తి చేసారు.

11_020 బాలభారతి – మణిమాల

మాతృభాషయందుమాతృదేశమునందు
మాతృదేవియందు మమత లేని
వాడు పుటెనేని భారమ్ము భూమికి !
కలిగి వాడు తల్లికడుపుచేటు !

11_020 ఉన్మత్త రాఘవం

వన్య మార్గములెల్ల యూడ్చి, కలశ ధారలతో పవిత్ర మొనరించి,
పరిమళ భరితమౌ పుష్ప రాసుల మాలలతో నలంక రించుడు.
ఇనకుల గోత్రు డరుదెంచు చున్నాడు
సీతకు ముదమలరింప బంగారు లేడితో….!!!

11_020 ముకుందమాల 09

భక్తి లేనివారి సాంగత్యం వల్ల అంతకు ముందు మనలో ఉన్నది కూడా లుప్తమై, నాస్తికమనస్తత్వం ఏర్పడుతుంది. భగవద్భక్తి కలవారి దర్శనమే దైవదర్శనమంత ఆనందాన్ని, శాంతినీ ఇస్తుంది.
రామభక్తి సామ్రాజ్యమే మానవుల కబ్చెనో
ఆ మానవుల సందర్శన మత్యంత బ్రహ్మానందమే అంటారు త్యాగరాజు తన బంగాళ రాగ కృతిలో.