12_001

12_001 ఆనందవిహారి

అమెరికా లో శ్రీ షిర్డీసాయి మందిర్, శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ( SAPNA ), తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగొ ( TACC ) సంయుక్తంగా నిర్వహించిన సంగీత, సాహిత్య కార్యక్రమం విశేషాలు, చెన్నై అమరజీవి స్మారక సమితి అధ్వర్యంలో నెల నెలా వెన్నెల కార్యక్రమంలో భాగంగా “ విశ్వసాహిత్యం – మాలతీచందూర్ దృక్పథం ” కార్యక్రమ విశేషాలు….

12_001 కూచింత కాఫీ

చిత్రకారుడు ‘ కూచి ’ కుంచె నుంచి జాలువారిన కాఫీ హాస్య, వ్యంగ్య గుళికలు…… మరికొన్ని… .

12_001 కన్యాశుల్కం – ఒక పరిశీలన

ఈ నాటకం కన్యాశుల్క దురాచారాన్ని బలం గా ఖండించడం కోసం రాయడం జరిగింది అనే వాదన ఉన్నప్పటికీ నాటకం లో ప్రస్తావన చేసిన విషయం ముక్కుపచ్చలారని బాలికలను వయోవృద్ధుల కు కన్యాశుల్కం తీసుకుని వివాహం చేయడం. వృద్ధులకు బాలికల నిచ్చి పెళ్ళి చేయడం ఖండించదగిన సామాజిక దురాచారం. అప్పటి కన్యాశుల్కం, ఇప్పటి వరకట్నం వ్యక్తుల ఆర్ధిక వ్యవహారం.

12_001 అష్టావధాన వైభవం

ఇకపై బంగళపాకలన్ చనక తామే భవ్యగేహస్థులూ
రకనేపాలకుపిల్లలేడ్వనటులన్ రాణింపుమా భారతీ !

12_001 ముకుందమాల – భక్తితత్వం

విష్ణుకథలను విన్న మనసుకు ఎంత భరోసా! ఆ స్వామి వెనుబలమై ఉంటాడు అంటూ భగవద్గీతలో కూడా చెప్పబడింది. నారదాదులు ఆ స్వామి శ్రీహరిని ఎంతగా కీర్తించారో తెలుసుకదా! వేదవ్యాసుల వారు ఎన్నివిధాల ఆ స్వామిని గురించి కధలు, పురాణాలూ చెప్పారో! వినికిడి ఉన్నఫలం విష్ణునామ, విష్ణుకధా శ్రవణం సుమా!