అక్కడ దుర్యోధనుడు… ఇక్కడ శకుని

నిజమైన నటుడికి సాధ్యం కాని పాత్ర అంటూ వుండదు. రెండు విభిన్న మనస్తత్వాలు గల పాత్రలు…. ఒకటి రాజ్యకాంక్షతో బంధుత్వాలను కూడా కాలదన్నిన అహంకార పూరితమైన దుర్యోధనుని పాత్ర. మరొకటి తన పగ తీర్చుకోవడం కోసం కపట నాటకమాడి దుర్యోధనాదులలో బలహీనతలను, అహంకారాన్ని రెచ్చగొట్టిన శకుని పాత్ర.

రంగస్థలం మీద దుర్యోధనుని పాత్రకు, వెండితెర మీద శకుని పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేసిన నటుడు ధూళిపాళ సీతారామశాస్త్రి . అప్పటివరకూ వెండితెర శకునిగా వెలుగొందిన సీయస్సార్ స్థానాన్ని ఆక్రమించిన గొప్ప నటుడు ధూళిపాళ.  1921 వ సంవత్సరం గుంటూరు జిల్లా గురజాల తాలూకా దాచేపల్లి గ్రామంలో శుద్ధ శ్రోత్రియ కుటుంబంలో జన్మించిన ధూళిపాళ ఎనిమిదో తరగతి వరకూ తమ గ్రామంలోనే చదివారు. అంతకంటే చదివే అవకాశం ఆ గ్రామంలో లేకపోవడం చేత బాపట్లలో వేద పాఠశాలలో చేరి వేదాధ్యయనం చేసారు. తరువాత తండ్రిగారి బలవంతం వలన గురజాలలో వాలంటరీ పని నేర్చుకోవడానికి వెళ్ళారు. ప్లీడరు గుమాస్తా దగ్గర సహాయకుడిగా ఉండే పనిని అప్పట్లో వాలంటరీ అనేవారు. ఆ పని చేసినందుకు జీతభత్యాలేమీ వుండవు. పని నేర్చుకోవడం కోసమే చేరేవారు. అక్కడినుంచి గుంటూరు వెళ్ళాక ఆయనను రంగస్థలం పలుకరించింది. మొదట్లో ఎక్కువగా ఆడవేషాలు వేసిన ధూళిపాళ మాధవపెద్ది వెంకట్రామయ్య గారి ప్రోత్సాహంతో ‘ వీరాభిమన్యు ‘ నాటకంలో అభిమన్యుని పాత్ర పోషించి పేరు తెచ్చుకున్నారు. తర్వాత అనేక పాత్రలు పోషించినా ఆయనకు రంగస్థలం మీద ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది మాత్రం దుర్యోధనుని పాత్ర.

ఆయనకు  చలనచిత్ర రంగ జీవితాన్నిచ్చింది కూడా దుర్యోధనుని పాత్రే ! అంతకుముందు ఒక చిత్రంలో ఒక చిన్న పాత్రలో కనిపించినా ఆయనకు గుర్తింపు తెచ్చింది మాత్రం ఈ పాత్రే ! అది కూడా అప్పటికే అగ్రనటుడైన, నట సార్వభౌముడైన నందమూరి తారక రామారావు కురువృద్ధుడు భీష్మునిగా నటించిన బి. ఏ. సుబ్బారావు గారి ‘ భీష్మ ‘ చిత్రంలో . మొదటి చిత్రంలోనే ఎన్టీయార్ ప్రశంసలందుకుని ఆయనకు అభిమాన నటుడిగా మారిపోయారు ధూళిపాళ.

ఎన్టీయార్ అభిమానానికి చిహ్నమే ధూళిపాళ ను వెండితెర శకునిని చేసింది. శ్రీకృష్ణ పాండవీయం ద్వారా ఆయనకా అవకాశం ఇచ్చారు రామారావు. ఆ అవకాశాన్ని అంది పుచ్చుకుని ఆ పాత్రను తెలుగు ప్రేక్షకుల మదిలో శాశ్వతం చేసారు ధూళిపాళ. అప్పటివరకూ అపర శకునిగా పేరు తెచ్చుకున్న సీయస్సార్ ని మరిపించారు. ఇవే కాకుండా ‘ కలిమిలేములు ‘ చిత్రంలో జమిందారు పాత్రతో ప్రారంభించి ఎన్నో సాంఘిక చిత్రాల్లో ఎన్నో రకాల పాత్రలు పోషించారు. నటనకు భాష్యం చెప్పగల ధూళిపాళ అస్త్ర సన్యాసం చేసినట్లు తన నటనకు వీడ్కోలు చెప్పి శేష  జీవితాన్ని హనుమాన్ మందిర నిర్మాణంలోను, ఆంజనేయ ఉపాసకుడిగా ఆథ్యాత్మిక మార్గంలో గడిపారు.

నిజమైన నటుడికి సాధ్యం కాని పాత్ర అంటూ వుండదు. రెండు విభిన్న మనస్తత్వాలు గల పాత్రలు…. ఒకటి రాజ్యకాంక్షతో బంధుత్వాలను కూడా కాలదన్నిన అహంకార పూరితమైన దుర్యోధనుని పాత్ర. మరొకటి తన పగ తీర్చుకోవడం కోసం కపట నాటకమాడి దుర్యోధనాదులలో బలహీనతలను, అహంకారాన్ని రెచ్చగొట్టిన శకుని పాత్ర.

రంగస్థలం మీద దుర్యోధనుని పాత్రకు, వెండితెర మీద శకుని పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేసిన నటుడు ధూళిపాళ సీతారామశాస్త్రి . అప్పటివరకూ వెండితెర శకునిగా వెలుగొందిన సీయస్సార్ స్థానాన్ని ఆక్రమించిన గొప్ప నటుడు ధూళిపాళ.  1921 వ సంవత్సరం గుంటూరు జిల్లా గురజాల తాలూకా దాచేపల్లి గ్రామంలో శుద్ధ శ్రోత్రియ కుటుంబంలో జన్మించిన ధూళిపాళ ఎనిమిదో తరగతి వరకూ తమ గ్రామంలోనే చదివారు. అంతకంటే చదివే అవకాశం ఆ గ్రామంలో లేకపోవడం చేత బాపట్లలో వేద పాఠశాలలో చేరి వేదాధ్యయనం చేసారు. తరువాత తండ్రిగారి బలవంతం వలన గురజాలలో వాలంటరీ పని నేర్చుకోవడానికి వెళ్ళారు. ప్లీడరు గుమాస్తా దగ్గర సహాయకుడిగా ఉండే పనిని అప్పట్లో వాలంటరీ అనేవారు. ఆ పని చేసినందుకు జీతభత్యాలేమీ వుండవు. పని నేర్చుకోవడం కోసమే చేరేవారు. అక్కడినుంచి గుంటూరు వెళ్ళాక ఆయనను రంగస్థలం పలుకరించింది. మొదట్లో ఎక్కువగా ఆడవేషాలు వేసిన ధూళిపాళ మాధవపెద్ది వెంకట్రామయ్య గారి ప్రోత్సాహంతో ‘ వీరాభిమన్యు ‘ నాటకంలో అభిమన్యుని పాత్ర పోషించి పేరు తెచ్చుకున్నారు. తర్వాత అనేక పాత్రలు పోషించినా ఆయనకు రంగస్థలం మీద ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది మాత్రం దుర్యోధనుని పాత్ర.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *