నందనవనంలోకి…

మొదటి అడుగు!

దారంతా రంగులచిత్రాలు.

మకరందం మత్తులో,..

ఓ తుమ్మెద పరవశం!

గొంతును తాకిన…

చిగురు లోంచి రాగం.

వసంతాగమనంలో…

ప్రకృతి యవ్వనహేల.

మరో అడుగు ముందుకు!

మహారణ్య ముడుల్లోంచి…దారి !

గ్రీష్మతాపం.

ఆనక…

సముద్రతలంపై ..డోలాయానం.

పిదప…

ఓ పర్వతారోహణం.

ఓ సాహసం!

ఓ మందహాసం!

వెనుకనే..

ఓ జల్లు!

క్రమంగా…పెనువృష్టిగామారి….

ప్రచండఘోషతో ప్రభంజనం!

ఓ ప్రళయం!

మళ్ళీ….

సువిశాల మైదానంలో…

శరద్రాత్రి వెన్నెల.

చల్లని వీచికలో…

విశ్రాంతి.

తరువాత…

వణికించే చలి.

వంగిన నడక.

శిశిరం బరువు దించుకొంటున్న..

చెట్టుకింద….కాస్త విశ్రాంతి!

చివరి అడుగు…

ఎడారిలో!

వేడిగా గాలి.

తెరలుగా ధూళి.

తెలియని దూరం.

తెలిసిన సత్యం!

ఇదే ప్రస్థానం!

వసంతాల్ని పూయిస్తే…

వాసనలు వెంటొస్తాయి.

అడుగుల్ని జత చేస్తే…

చివరిదాకా తోడుంటాయి!

….. 5. స్వాతంత్ర్య దీప్తి                                                                                                        7. నేను సైతం – రేణుక అయోల′ మూడవ మనిషి ‘ …….