స్వాగతం

అందరికీ నమస్కారం. 

‘ శిరాకదంబం ‘ పత్రిక గత కొన్ని నెలలుగా వెలువడక పోవడానికి అనేక ఆటంకాలు…..  

మొదటగా మూడు నెలల క్రితం వరకు వెబ్సైట్ ను హోస్ట్ చేసిన హోస్టింగ్ ప్రొవైడర్ వద్ద ఏదో సాంకేతిక సమస్య తలెత్తి, గత 7 సంవత్సరాలుగా అందులో నిర్వహించిన సంచికల మొత్తం డాటా అంతా మాయమైపోయింది. ఈ మూడు నెలలుగా పరిష్కారం కోసం వారిని సంప్రదించడానికి  ఎంతగా ప్రయత్నించినా ఫలితం శూన్యం. చాలా ఎక్కువ సార్లు కస్టమర్ కేర్ అందుబాటులో ఉండేది కాదు. దొరికినా సరైన సమాధానం దొరకేది కాదు. అందుకే చాలా విసిగిపోయి జరిగిన నష్టాన్ని పూరించుకునే అవకాశం కనబడక ఆ ప్రొవైడర్ నుండి మరో ప్రొవైడర్ కి మార్చవలసి వచ్చింది. 

చాలా విలువైన సమాచారం ఈ కారణంగా పోగొట్టుకోవడం జరిగింది. మళ్ళీ పాత సంచికలను వీలైనంత సులభమైన పద్ధతిలో ‘ గత సంచికలు ‘  విభాగంలో కాలక్రమేణా పొందుపరచడం జరుగుతుంది.  గతంలో సోషల్ మీడియా లో ఇచ్చిన లింక్ లు ఏవీ ఇప్పుడు పనిచెయ్యవని పాఠకులు, మిత్రులు గమనించ ప్రార్థన. 

రెండవది – అనారోగ్య కారణం వలన, కొన్ని వ్యక్తిగత సమస్యల వలన పత్రిక వెబ్సైట్ కొత్తగా పునర్మించడం ఆలస్యం అవుతోంది. త్వరలోనే ఆ పని పూర్తి చేసి మళ్ళీ కొత్తగా ‘ శిరాకదంబం ‘ పత్రికను మీ ముందుకు తీసుకురావాలని ఆకాక్షింస్తూ….. మీ అందరి సహాయ సహకారాలను కోరుకుంటూ…. 

మీ 

శి. రా. రావు

వ్యవస్థాపక ప్రచురణ కర్త / సంపాదకుడు