Address

13_008 తో. లే. పి. – మే‌రి ఎకనమౌ

కలం స్నేహం మనసులకు వారధి. ఆలోచనలు‌-అభిరుచులకు ఒకరికొకరు చిరుకానుకలను జతచేసి పంచుకోవడం ఆనాటి ఆ స్నేహం లోని ఒక ప్రత్యేకత. ఆ స్నేహమాధురి అనుభవైకవేద్యం. నిజానికి, అక్షరాలలో ఇమడనిది. భగవద్దత్తమైన ఈ చెలిమి కలిమిని నేను కేవలం మన భా‌రతవాసులతో మాత్రమే కాకుండా, ఇతర దేశాలకు చెందినవారితో సహా ( శ్రీలంక, నేపాల్, ధాయిలాండ్, బ్రిటన్,అమెరికా, ఫ్రాన్స్, జర్మని, నెదర్ లాండ్స్ మొదలయిన దేశస్ధులతో సహా) పంచుకోవడం నాకొక మధురానుభూతి.

13_002 తో. లే. పి. – క్లాడియా హాలోవే

portrait artist గా ఎంతో నేర్పుతో వేసిన చిత్రాలలో ప్రత్యేకించి Queen Elizabeth, Prince Charles చిత్రాలు చెప్పుకోదగ్గవి.
వాటిని లండన్ నగరంలోని వారిచిరునామాకి పోస్ట్ పంపుతూ ప్రతిగా వారి స్పందనతో ఉన్న ఉత్తరాన్ని సంపాదించాలని…
నేను ఆయన సలహాను వెంటనే ఆమోదిస్తూ‌ ఆయన నాకు పంపిన portrait sketch కి Prince Charles కి వ్రాసిన ఉత్తరాన్ని జోడిస్తూ, చిరునామాని సంపాదించి దానిని Buckingham Palace కి పంపడం ఒక అపూర్వమైన, అందమైన అనుభవం.!

11_004 తో. లే. పి. – ఆర్టిస్ట్ వాట్స్

ఒక రచన చదివినా, ఒక చిత్రాన్ని చూసినా మనలో ఒక స్పందన కలగడం సహజం. అయితే, ఆ వెంటనే ఆ స్పందనను ఉత్తరరూపంలో ఆ రచయిత కు కానీ చిత్రకారునికి గానీ తెలియపరచడం పాఠకుని ప్రధమ కర్తవ్యం. అది అవతలివారికి కూడా స్ఫూర్తిని ఇస్తుంది. అనడం లో ఎట్టి సందేహానికి తావు లేదు.