Arjun

12_011 ముకుందమాల – భక్తితత్వం

ఈ శ్లోకాలలో మహారాజు తెలియజెప్పాలనుకున్నది భక్తి… భక్తి… భక్తి… ఇదొక్కటే మానవునికి ఇహపర సాధనం! ఇహలోకంలో దీని వలన లాభమేమిటీ అని ప్రశ్నించుకుంటే చాలా లాభమే ఉందీ అని చెప్పాలి. భక్తి వలన మనిషిలో సాత్విత భావం పెరుగతుంది. ఓర్పు, సహనం అలవడుతుంది. అంతేకాదు. భక్తికి ప్రధాన లక్షణం ప్రేమ, ‘‘అనురాగము లేని మనసున సుజ్ఞానము రాదు’’

12_010 ముకుందమాల – భక్తితత్వం

ఎవ్వనిచే జనించి, ఈ జగమెవ్వని లోపల నుండి, ఎవ్వని యందు లీనమగుచున్నదో, అతడే పరమేశ్వరుడూ, పరబ్రహ్మమూ అని చెబుతోంది ఉపనిషత్తు. అతడు శ్రీకృష్ణుడే! విత్తులో అణిగి వున్న చెట్టులా, సూక్ష్మంగా పరమాత్మలో అణగి ఉండి, సృష్టికాలంలో ఆ పరమాత్మ సంకల్పంతో, లేచి, విస్తరించేలా, శ్రీకృష్ణుని యందే ఈ సర్వజగత్తు ఉన్నది. ఆ కారణతత్వమే శ్రీకృష్ణ పరబ్రహ్మ.

12_009 ముకుందమాల – భక్తితత్వం

నామరసాయనం నీకు శక్తినిస్తుంది. ఆ నామస్మరణ భగవంతునికి దాసుని చేస్తుంది. అంటే ఇంక ఈ చంచలమైన మనసుకు నీవు దాసుడవు కావు అన్నమాట! అప్పుడే పరమాత్ముని గురించిన జ్ఞానం పరమాత్మకు దగ్గర చేస్తుంది. ఈ రసాయనం లోపలి కల్మషాన్ని కరిగించి బలాన్నిస్తుంది. అంతటి శక్తివంతమైనది నామ రసాయనం. నామం ఉంటే నామి ఉన్నట్లే. నామి తోడుంటే మనసుకు బలం, ధైర్యం. విష్ణు కథలు వింటే అర్ధం అవుతుంది. ఆ స్వామి అండ ఎంత బలమో!

12_008 ముకుందమాల – భక్తితత్వం

వేంకటేశా! మేం నిన్ను తలచేంత పని లేకుండానే నీ దాసులే మాకు ఇహపరాల నివ్వగల సమర్థులు. ఎందుకంటే నిన్ను సంపూర్ణంగా తెలుసుకున్న విజ్ఞానులు వారు. మరి వారిని తెలుసుకుని అనుసరిస్తే నిన్ను తెలుసుకున్నట్లే కదా! అందుకే నీ బంటు బంటుకు బంటునయినా చాలు. నీకు దాసుడనై తరించినట్లే! అంటారు అన్నమయ్య దాసోహపద్ధతిని వ్యక్తపరుస్తూ.

12_007 ఉత్తరాయణం

సూర్యుడు తన నిరంతర యానంలో మకర రాశిలోకి ప్రవేశించే రోజునే ‘ మకర సంక్రాంతి ‘ అని పిలుస్తారు. దక్షిణ దిక్కు నుంచి ఉత్తర దిక్కు కు సూర్యుడు తన ప్రయాణ దిశను మార్చుకునే సందర్భాన్ని ‘ ఉత్తరాయణం ‘ అని అంటారు. ఈ ఉత్తరాయణం చాలా విశిష్టమైనది. ‘ ఉత్తరాయణ పుణ్యకాలం ‘ అనడం అందరూ వినే ఉంటారు. ఆ విశేషాలేమిటో డా. ఇవటూరి శ్రీనివాసరావు గారు గతం లోని ఈ వీడియోలో వివరిస్తున్నారు.

12_006 ముకుందమాల – భక్తితత్వం 13

శ్రీకృష్ణుని సౌందర్యముద్రామణి అనీరుక్మిణిదేవికి మణి భూషణమనీ గోపాలచూడామణీ అనీ చెబుతూ భక్తుల పాలిటికి త్రైలోక్యరక్షామణి ఇతడు అంటూ వర్ణిస్తారు శ్రీ కులశేఖరులు. అన్నమయ్య ఈ గోపాలదేవునే యశోద ముంగిట ముత్యంగాగొల్లెతల అరచేతి మాణిక్యంగా కాళింగుని తలపై పుష్యరాగంగా వర్ణిస్తూ కంసుని పాలిట వజ్రమైన ఈ దేవుడు మాకు గతియైన కమలాక్షుడు అంటూ వర్ణిస్తారు. ఏమి ఈ భక్తుల భావ సారూప్యం!

11_006 ముకుందమాల 02

బిడ్డలమైన మనను తండ్రి ప్రేమకు పాత్రులను చేసేది తల్లి శ్రీ. ఆమె లక్ష్మి. కృష్ణావతారంలో రాధగా, రుక్మిణిగా వచ్చినది ఆతల్లియే! ఆమె నాశ్రయిస్తే ఆమె ద్వారా పరమేశ్వరానుగ్రహం లభిస్తుంది. ఆ తల్లి అనుగ్రహం లేనిదే భగవదనుగ్రహం లభించడం కష్టం. భగవానుని నామాల్లో స్వామికి ఇష్టమైన నామం శ్రీవల్లభ! అందుకే ముందుగ ఆ నామంతో కీర్తించడం! అలా కీర్తించిననాడు భగవానుడు మనలను రక్షించకుండా ఉండలేడు. అమ్మద్వారా ఆశ్రయించడమే మన యోగ్యతగా, మనకు వరాలిస్తాడు.

11_004 ముకుందమాల

ప్రత్యేక సిద్ధాంతాలనన్నింటినీ, ఆత్మానుభూతితో భక్తిసూత్రంచే ముడిపెట్టి మానవుని జన్మమొదలు ముక్తివరకు గల క్రమవికాసమును సమగ్రంగా, సరళంగా, భక్తిపూర్వకంగా అనుభూతమొనర్చుకుని, పరంధాముని రూప, గుణ విభవాలను హృదయములో నింపుకుని, ఆ పారవశ్యంలో శ్రీకృష్ణ పాదారవిందాలపై ఉంచిన భక్తికుసుమాల మాల ఇది.