13_004 కూచిత్తరువు – వెన్నెల్లో హాయ్… హాయ్…
చిత్రకారుడు ‘ కూచి ’ కుంచె నుంచి జాలువారిన మరో కళాఖండం….
చిత్రకారుడు ‘ కూచి ’ కుంచె నుంచి జాలువారిన మరో కళాఖండం….
మూగజీవుల జీవన విధానాన్ని….గమనాన్ని పరిశీలించడం ఓ కళ. అదో గొప్ప శాస్త్రం. తరచూ అద్దం మీద వాలి సందడి చేసే ఓ పిచుకని చూసినప్పుడు నాలో కలిగిన ఆలోచన….ఈ కవితకి ప్రేరణ.
బాల్యంలో వానాకాలం పంచిన అనుభూతులు ఎప్పటికీ చెరిగిపోనివి. ఆ అనుభూతి స్మరణ లోంచి ఉదయించిన కవితే “వానపండగ “
portrait artist గా ఎంతో నేర్పుతో వేసిన చిత్రాలలో ప్రత్యేకించి Queen Elizabeth, Prince Charles చిత్రాలు చెప్పుకోదగ్గవి.
వాటిని లండన్ నగరంలోని వారిచిరునామాకి పోస్ట్ పంపుతూ ప్రతిగా వారి స్పందనతో ఉన్న ఉత్తరాన్ని సంపాదించాలని…
నేను ఆయన సలహాను వెంటనే ఆమోదిస్తూ ఆయన నాకు పంపిన portrait sketch కి Prince Charles కి వ్రాసిన ఉత్తరాన్ని జోడిస్తూ, చిరునామాని సంపాదించి దానిని Buckingham Palace కి పంపడం ఒక అపూర్వమైన, అందమైన అనుభవం.!
ప్రకృతి ఒడిలో విభిన్న సౌందర్యాలు…. మనిషి ఆనందం కోసమేనన్న సత్యాన్ని విస్మరించి…. యాంత్రికంగా జీవిస్తున్న మనిషి తీరు ఈ కవితకు ప్రేరణ.
స్వచ్ఛ భారత్ – దృశ్య శ్రవణ చిత్రం
కళలమ్మ పాదాలపై పడి జన్మలు వేడుకున్నా దొరకని వరం కళాప్రవేశం!
రేణువంత దొరికినా అది ఆ చల్లనితల్లి కృప!
ఏదో జన్మవాసనలు మనసునిపట్టి ఏదైనా ఒక్క లలితకళలో ఆవగింజంత అభినివేశం దొరికినా జన్మధన్యమే!
దానిని పరిపూర్ణాంగా కాకపోయినా..కొనఊపిరి ఉన్నంతవరకూ నిలబెట్టుకోవడం అసిధారావ్రతం!
వేడి సెగలతో జనజీవనాన్ని వుడికించే వేసవిలో .. ఓ రాత్రి వేళ..పలకరించే ఆత్మీయ అతిధి… వర్షం. అదే ఈ కవితకు స్ఫూర్తి.
పరమ భక్తుడైన విప్రనారాయణుడు విష్ణువుని రంగనాథుడి రూపంలో కొలుస్తూ ఉంటాడు. చోళ రాజు ఆస్థానంలో నృత్య ప్రదర్శన తర్వాత నర్తకి దేవదేవి తన చెల్లెలు మధురవాణితో కలసి వస్తూ విప్రనారాయణుని ఆశ్రమం మీదుగా వస్తూ ఉంటుంది. తనని పట్టించుకోకుండా దైవ కైంకర్యంలో మునిగిపోయిన నారాయణుని చూసి అహంకారిగా, పొగరుబోతుగా తలచి, అతనికి గుణపాఠం చెప్పాలనుకుంటుంది. అనాధగా చెప్పుకుంటూ నారాయణుని ఆశ్రమం లోకి ప్రవేశించి సహాయం కోరుతుంది. అయితే ఆమె ఆశ్రమంలో ఉండడంలోని ఉద్దేశ్యాన్ని పసిగట్టిన నారాయణుడి శిష్యుడు రంగరాజు అభ్యంతరం చెప్పినా వినకుండా అతన్ని బయిటకు పంపించి దేవదేవిని శిష్యురాలిగా చేసుకుంటాడు నారాయణుడు.
ప్రపంచంలోని అన్ని అందాలు మనిషి ఆనందం కోసమే దేవుడు సృష్టించాడు అనేది సత్యం. సౌందర్యాస్వాదనలేని జీవితంకన్నా పేదరికం లేదనేది నా స్వానుభవంలో తెలుసుకున్నాను. ఆ భావనలో వచ్చి పుట్టినదే ఈ అమృత వర్షం అనే కవిత.