Avakaya

11_002 హాస్యగుళికలు – ఆవకాయ పెట్టాలా ? వద్దా ?

అత్తగారు: ఆఁ, నీ చేతి వంట తినలేక ఛస్తున్నాను. కూరలో ఉప్పు ఉండదు, పచ్చట్లో పులుపు ఉండదు, పులుసులో ముక్కలుండవు, చారులో ఘాటు ఉండదు. నా నాలుక చచ్చిపోయింది. నా నోటికి కాస్త ఆవకాయ తగిలిస్తే గాని ప్రాణం లేచిరాదు.
కోడలు: ఎందుకండీ ఒళ్ళు పాడు చేసే ఆవకాయ మీద అంత మోజు? తాజాగా రోజుకొక పచ్చడి చేసుకొని హాయిగా తినచ్చు కదా?