Bangalore

12_006 మధుర గాయకునితో ఒక జ్ఞాపకం

మాంబళం స్టేషన్ లో ఎలక్ట్రిక్ ట్రైన్ దిగి టి. నగర్, ఉస్మాన్ రోడ్ పట్టుకుని కాలి నడక న వెడుతూ, ఇంటి నెంబర్లు వెతుక్కుంటూ వెళ్లి – చివరకు 35 నెంబరు ఇంటిదగ్గర ఆగి చూసాను. ముందు గేటు, ప్రక్కన ప్రహరీ గోడలో బిగించిన బోర్డు మీద ” ఘంటసాల ” అన్న అక్షరాలు.! ఆ అక్షరాలను చూస్తుంటే సాక్షాత్తూ ఆయన దర్శనం కలిగినంత ఆనందం కలిగింది. మెల్లగా గేటు తోసి – లోపలకి అడుగు పెట్టాను. పెద్దాయనను చూడబోతున్నామన్న ఆనందాన్ని కప్పి వేస్తూ – ఒక పక్క భయం – ఇంకొక పక్క తడబాటు – వేరొక పక్క ఉత్కంఠ !