12_008 బాలభారతి – బాలలూ !
కండబలముతో గుండెబలముతో
దండిమగల మనిపించాలి !
నీతికి నిలబడి నిజాయితీతో
జాతిపేరు నిలబెట్టాలి !
కండబలముతో గుండెబలముతో
దండిమగల మనిపించాలి !
నీతికి నిలబడి నిజాయితీతో
జాతిపేరు నిలబెట్టాలి !
అమెరికాలోని చికాగొ లోని శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ( సప్నా ), భారతీ తీర్థ వారి సంయుక్త అధ్వర్యంలో జరిగిన తెలుగు సాహిత్య సభ “ విశ్వ వేదిక మీద తెలుగు సాహిత్యం ” కార్యక్రమ విశేషాలు…..
చెన్నై అమరజీవి స్మారక సమితి అధ్వర్యంలో నెల నెలా వెన్నెల కార్యక్రమంలో భాగంగా 31వ సంచిక “ తెలుగునాట ఎలక్ట్రానిక్ మీడియాలో తొట్టతొలి మహిళా జర్నలిస్ట్ ” ముఖాముఖీ, 32వ సంచిక అమరజీవ్ పొట్టి శ్రీరాములు, ఆయన శిష్యులు వై. ఎస్. శాస్త్రి, చిత్ర… చలనచిత్రకారులు బాపు గార్ల గురించి “ ముగ్గురు తేజోమూర్తులు ” ప్రసంగ కార్యక్రమ విశేషాలు….
నీలినీలపుఆకాశం
విప్పినగొడుగల్లే వుంది !
చుక్కలు నిండిన ఆకాశం
చిల్లులగొడు గై పోతుంది !
వంపుసొంపుల నా కొమ్ములలో
వాడనివీడనిఅందా లున్నవి !
సన్నగ కీసగ ఉండే కాళ్ళే
ఉన్న అందమునుచెఱచుచున్నవి !