Birth

12_010 జగతిలోన లేదు మిన్న జన్మభూమి కన్నా

రచన : రాధ కృష్ణ రావు గారు
సంగీతం : శ్రీమతి సి. ఇందిరామణి
గానం: చింతలపాటి సురేష్, బాలాజీ కరి, సురేష్ కుమార్, కళ్యాణ్ శ్రీనివాస్ పాలగుమ్మి, సుధ తమ్మ, సీత ఆణివిళ్ళ, హారిక పమిడిఘంటం, డా. చిత్ర చక్రవర్తి

12_009 కమలోద్భవ కౌత్వం

కలాపాలు, యక్షగానాలు, నృత్యనాటికలతోపాటు కూచిపూడి నాట్యంలో కొన్ని ప్రత్యేకమైన ప్రక్రియలున్నాయి. వాటిలో సింహనందిని, మయూర కవుత్వం లాంటివి దేవాలయ నృత్యాలు. దేవాలయ ఉత్సవాలలో దేవుడికి అర్పించే క్రతువులివి. ముగ్గుపిండిని ఒకచోట పోసి దానిమీద ఒక క్రమపద్ధతిలో నర్తిస్తే సింహం ఆకారం ఏర్పడడం సింహనందినీ నృత్యం. నెమలి ఏర్పడేట్టు చేసే ఇంకొక ప్రక్రియ మయూర కవుత్వం.