Chicago

13_006 నల్లని మేని నగవు చూపులవాడు ”…

శ్రీమతి భవ్య బేహత గారు అమెరికా చికాగో నగరంలో రెండు దశాబ్దాలుగా వీణ గాత్రం విద్యార్థులకి నేర్పుతున్నారు. బలమైన సంగీత సంప్రదాయాన్ని అమెరికా లో పటిష్ఠం చేస్తూ పాశ్చాత్య సంగీత కళాకారుల మన్ననలు పొందుతున్నారు. భవ్య బేహత డా. ఈమని కల్యాణి గారి నుండి ఈమని వీణా సంప్రదాయ పద్ధతి అభ్యసించి ప్రచారం చేస్తున్నారు. చికాగో “ రాగ ప్రభ “ అంతర్జాతీయ వీణా ఉత్సవాల సందర్భంగా అన్నమాచార్యుల వారి పద సంకీర్తనలు శిష్యులతో ప్రదర్శించారు.

సునాదసుధ – ఆథ్యాత్మిక తత్వ సంకీర్తన

అమెరికా చికాగో దగ్గరలో ఫ్లాస్ మోర్ లో ఉన్న ‘ సునాదసుధ ‘ సంగీత కుటీరంలో జరిగిన ప్రదర్శన.
…. బౌలి రాగం లో అన్నమాచార్య కీర్తన….
ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమే మున్నది
నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను ||

12_011 సునాదసుధ – శారదే కరుణానిధే

అమెరికా చికాగో దగ్గరలో ఫ్లాస్ మోర్ లో ఉన్న ‘ సునాదసుధ ‘ సంగీత కుటీరంలో జరిగిన ప్రదర్శన నుంచి విఘ్నేష్ మనోహరన్ గానం చేసిన శృంగేరి పీఠాధిపతి రచించిన కీర్తన… హమీర్ కళ్యాణి రాగం లో…. .
శారదే కరుణానిధే…..

12_010 సునాదసుధ – నమో నమో రఘుకుల నాయక

అమెరికా చికాగో దగ్గరలో ఫ్లాస్ మోర్ లో ఉన్న ‘ సునాదసుధ ‘ సంగీత కుటీరంలో జరిగిన ప్రదర్శన నుంచి విద్వాన్ అరవింద్ సుందర్ గానం చేసిన అన్నమయ్య కీర్తన… నాట్ట రాగం, రూపక తాళం.
నమో నమో రఘుకుల నాయక దివిజవంద్య
నమో నమో శంకరనగజానుత…..

12_008 సునాదసుధ – నగుమోము గనలేని

అమెరికా చికాగో దగ్గరలో ఫ్లాస్ మోర్ లో ఉన్న ‘ సునాదసుధ ‘ సంగీత కుటీరంలో జరిగిన గిటార్ పైన బర్కిలీ స్కూల్ సంగీత విశ్వవిద్యాలయంలో పాశ్చాత్య శాస్రీయ సంగీతంతో పాటు భారతీయ కర్ణాటక సంగీత బాణీ లో ప్రతిభ పొందిన “ జో రూఎన్ “, హిందూస్తానీ తబలా వాద్యంలో పేరు పొందిన “ ధనంజయ్ కుంటే “ ల ప్రదర్శన.
అభేరి రాగం, అది తాళం, త్యాగరాజ కీర్తన.

11_005 AV తాళ్ళపాక అన్నమాచార్య కళాభిజ్ఞత 02

సంగీతానికి గమ్యం ఎప్పుడూ కూడా సహృదయ, సామాజికుని మనస్సును రసానందభరితం చెయ్యడమే ! ఆ రసానంద సిద్ధి అనేది చిరంతనమూ, సనాతనమూ, సదాతనము. దానికి ప్రధానాంశాలు నాదమూ, గానమూ, సాహిత్యము. ఈ రసానంద విశ్లేషణకి ఈ అంశాల విశ్లేషణ చాలా ముఖ్యం…..

11_003 తాళ్ళపాక అన్నమాచార్య కళాభిజ్ఞత

అమెరికా చికాగొ నగరంలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా భారతీయ సాహిత్యం, కళలకు సేవలందిస్తున్న శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా వ్యవస్థాపకులు డా. శారదాపూర్ణ శొంఠి గారి “ తాళ్ళపాక అన్నమాచార్యుని సంగీత, నృత్య కళాభిజ్ఞత ” గురించిన సోదాహరణ ప్రసంగ పరంపర లో మొదటి భాగం….