13_005 తో. లే. పి. – అన్నయ్య వి. భూపతిరావు
స్కూల్ చదువు పూర్తి అవగానే మా అన్నయ్య కాకినాడ, పి.ఆర్. కాలేజీ లో ఇంటర్మీడియట్, ఆంధ్ర విశ్వ విద్యాలయం, వాల్తేరు లో B.E., ( Electrical Engineering ) పూర్తి చేసాడు. అప్పుడు కాలేజిలో వాడికి కొలీగ్స్.. ఆప్తమిత్రులు గొల్లపూడి మారుతీరావు, వీరాజీ, జ్యేష్ట, కొండముది శ్రీరామచంద్రమూర్తి ప్రభృతులు. వీరి సాహచర్యంలో వాడికి నాటకాలు, రచనలు, పాటలు పాడడం వగయిరాలతో అనుబంధం ఏర్పడింది.
తరువాత ఉద్యోగ పర్వం.