Dasu

11_002 ప్రతీచి – లేఖ

సంగీతానికి కావలసినవి రెండు. పాడేవాడి సంస్కారం. వినేవాడి సంస్కారం.
కొన్ని ధ్వనులు, చప్పుళ్ళు మనసుకీ ఆహ్లాదంగా ఉంటాయి. కొన్ని పాటలు అంతే ! అది తాత్కాలికం. రాగంతో అనుభూతి. మనసుకి సంబంధించినది కనుక. కొన్ని వేళల్లో అనుభూతి ఆనందంతో ఆరంభం. మరి కొన్ని భరించలేని దుఃఖం కలిగిస్తూనే పరమ సుఖంలో పర్యవసిస్తాయి. పదే పదే వింటాం. ఏడుస్తాం. మళ్ళీ వింటాం. ద్రవిస్తాం.