12_011 రాధ విరహగీతం
తొలిసిగ్గు నిండునాతో వేడుకగ బలికి అలరి నన్నలరించెనే
లలితంపు లేనవ్వు దొలకించు నాపైని వలువ వదులుగ సర్దేనే
తొలిసిగ్గు నిండునాతో వేడుకగ బలికి అలరి నన్నలరించెనే
లలితంపు లేనవ్వు దొలకించు నాపైని వలువ వదులుగ సర్దేనే
రాముడి పైనే రాసిన, ఈ జుజాహుళి రాగ కీర్తనలో త్యాగరాజుగారు రామనామాన్ని ఒక్కసారి కూడా పలకరు. కొన్ని సార్లు భక్తులు భగవంతుడిమీద అలిగి నిందస్తుతి చేసినట్టు. ఇందులో నిందలేకపోయినా రాముడికి వేర్వేర పేర్లతో బ్రతిమాలటం ఆసక్తికరంగా ఉంటుంది.
చిరు నవ్వు గల మోము జూప రారా రామ
కరుణతో నన్నెల్లప్పుడు కావ రారా
భగవంతుడనే అమృతం నిశ్శబ్ద ధ్యానం నుంచి ఉద్భవిస్తుంది. వాయిద్య, గాత్రాలు లేని ఈ సంగీతమే నిశ్శబ్ద గానం.
మనసనే ఈ పవిత్ర వనంలో నీరు లేకుండానే కమలం (మెదడు) వికసిస్తుంది, హంసలు (ప్రాణం) విహరిస్తాయి.