Dwibhashitalu

12_010 ద్విభాషితాలు – ఆత్మ నివేదన

పక్షులకు ఎగరడమే స్వేచ్ఛ.. ప్రాణం! వాటి హక్కు… తూటా దెబ్బలకు బలిఅయిన సందర్భాలలో… మనసు ద్రవించినప్పుడు ఆవిర్భవించిన కవిత… ఈ “ఆత్మ నివేదన”

12_009 ద్విభాషితాలు – వెన్నెలబండి

వెన్నెల రాత్రి…రైలు బండి సాధారణ బోగీలో..కిటికీ ప్రక్కన మెలకువగా కూర్చుని.. ప్రయాణించడం ఓ గొప్ప అనుభూతి. ఆ అనుభవం లోంచి పుట్టిన కవితకు దృశ్య శ్రవణ రూపం… ఈ “వెన్నెల బండి”

12_009 అమెరికా అమ్మాయితో ముఖాముఖీ 01

శాస్త్రీయ నృత్య కళారీతులకు అనుగుణంగా చిదంబరం లోని శ్రీ నటరాజస్వామి వారి దేవాలయ ప్రాంగణం లో నాట్య గురువు శ్రీ వెంపటి చిన సత్యం గారి కొరియోగ్రఫీ లో చిత్రీకరణ జరిగిన నా నాట్య ప్రదర్శన కు ఆధారమైన పాట డాక్టర్ శ్రీ సి. నారాయణరెడ్డి గారి రచన ” ఆనంద తాండవమాడే…శివుడు అనంతలయుడు ..”. ఈ పాట, తదనుగుణంగా శాస్త్రీయ నృత్యం నా పాత్ర కు జీవం పోసాయి అని ఘంటాపధం గా చెప్పవచ్చును.

12_007 ద్విభాషితాలు – మహాప్రపంచం

సాంకేతిక అభివృద్ధి ఎంత వేగంగా చోటు చేసుకొంటోందో …. అంతే వేగంగా ప్రపంచ పర్యావరణం… సంఘ వినాశనం… మానవతా విలువల పతనం సంభవిస్తున్నాయి. ఆ ఆవేదనలోంచి ఉద్భవించిన కవితకు దృశ్య శ్రవణ రూపం ఇది. ఈ కవితకు ప్రేరణ Bertrand Russell యొక్క వ్యాసం Man’s Peril.

12_006 విహారి

ప్రకృతి ప్రేమికుణ్ణి కావడం చేత ప్రతి సంవత్సరం ప్రకృతి స్వరూపాలైన అడవులు…పర్వతాలు లోయలు.. దర్శించడం… ఆ అనుభూతుల్ని నెమరు వేసుకోవడం.. అవి అక్షర రూపం దాల్చడం ఓ అలవాటుగా మారింది. అలా ఉద్భవించిందే.. ఈ “విహారి” అనే కవిత!