Ego

13_001 కనువిప్పు

వృత్తి పరంగా బిజీగా ఉండే భర్తను, పాశ్చ్యాత్య వాతావరణంలో పెరిగే పిల్లల్ని ఎలా చూసుకోవాలో, వారికి కావాలిసినదేమిటో, వాళ్ళ దగ్గరనుంచి తను పొందవలసినదేమిటో తెలుసుకోలేక పోయింది శిరీష. తన జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని ఎలా బాలెన్స్ చేసుకోవాలో తెలియక తికమక పడింది. ఆ తికమక లో శిరీషకు తెలియకుండానే తనలో దాగి వున్న అహంభావం, నిర్లక్ష్యం, సోమరితనం బయటకు తన్నుకువచ్చేవి. దాంతో ఇంట్లో ఎప్పుడూ గొడవలు . . .పోట్లాటలు. . . కోపతాపాలు… మౌనం.

12_009 శ్రీలక్ష్మి – కథ

సదా తన మనసెరిగి ప్రవర్తిస్తూ తన అలవాట్లను..తన బలహీనతల్ని..తన అహంకారాన్నీ..దురుసుతనాన్నీ భరిస్తూ వచ్చిన శ్రీలక్ష్మి, తనను వదిలి వెళ్ళిపోయి అప్పుడే పన్నెండు రోజులైంది అంటే హరిమూర్తి కి నమ్మశక్యంగా లేదు. శ్రీలక్ష్మి ఇక లేదు అన్న సత్యాన్ని, ఆమె సంపాదించుకున్న పేరును ఈ రెంటిని హరిమూర్తి జీర్ణించుకోలేక పోతున్నాడు. ఫ్యూనరల్ టైములో శ్రీలక్ష్మి పట్ల అందరూ చూపించిన గౌరవం, ప్రేమ, దుఖం చూసి అతను ఆశ్చర్యపోయాడు.