Folklore

13_005 గ్రామ దేవతల పూజలు

జానపద కథల్లో రేణుకా ఎల్లమ్మకు మాతృపూజ చేస్తారు. మాతృపూజా పద్ధతి ఈనాటికీ జానపద కథల్లో నిత్యహరితంగా నిలిచిపోయి ఉంది. జానపద సాహిత్యంలో ఎన్నో కథల్లో ప్రాముఖ్యం వహించేది ఈ అంశమే. ఇక్కడ ప్రతి గ్రామదేవత రూపంలోనూ తల్లి దేవత ప్రత్యక్షమవుతుంది. కొండాపురం, ఎల్లేశ్వరం, సంగమేశ్వరం, ఆలంపురం వంటి అనేక శిల్పాఖనులైన స్థలాలలో ఉండే స్త్రీ ప్రతిమలను చూస్తే, ఈ అంశం స్పష్టంగా తెలుస్తుంది.