12_006 ఘనవృత్తమ్
‘ లోకంలో బహు పురుషుల ఆలింగనంతో దూషితులైన వార వనితల సంగమం రసాభాస కారణమని పెద్దలు చెప్పెదరు కదా ’ అను నీతి వాక్యాలతో ఖండించి, ఆ వేశ్య ప్రయత్న పూర్వకంగా చేసే విలాసాలు తన ధర్మపత్ని సహజ విలాసాలకు ఎంత మాత్రం సరికావని చెబుతాడు. ‘ నా భార్య ఆకాశగంగ వంటిది. నీవొక కాలువ వంటి దానివి. ఆకాశంలో విహరించే హంస కాలువ లో విహరిస్తుందా? కనుక నీవు ఇక్కడ నుంచి వెంటనే వెళ్లిపో ’ అని గట్టిగా మందలిస్తాడు.