Gudimella

13_008 మేలుకొలికే అద్భుతాలు

వాగ్గేయకారులైన అన్నమాచార్యులు, త్యాగరాజస్వామికి ప్రత్యేక స్థానం ఉంది. ఇద్దరూ తమ కృతులతో పామరుల నుంచి జ్ఞానులను సైతం ఆలోచింపజేశారు. ఆధ్యాత్మిక, వాస్తవికత, సమాజహితం… ఇలా అన్ని అంశాలను మేళవించి ప్రతి హృదయాన్ని పులకింపజేశారు. అందుకే వారి కీర్తనలు ఎప్పటికీ మానవాళిని మేలుకోలుపుతుంటాయి. వారు రాగం, భావం, సంగీతం సమపాళ్లలో రంగరించడంవల్లే ఎప్పటికీ నిత్యనూతనంగా విరాజిల్లుతున్నాయి.

13_007 రాగాల రాకుమారుడు

భాషలందు తెలుగు లెస్స
వంశపారంపర్య మహత్యమేమో నాకు మలయాళంతో పాటు తమిళం, హిందీ, కన్నడ, ఫ్రెంచ్, ఆంగ్ల బాషలు వచ్చు. సొంపైన తెలుగు సాంతంగా అర్ధమవుతుంది. తెలుగు మాటలలోని ప్రతి చివరి అక్షరం హల్లులతో కలిసి ఉంటుంది. ఉదాహరణకి ‘రాముడు’, ‘రామ’ అంటూ దీర్ఘం తీయటానికి ఎంతో సౌకర్యం.

13_006 ఆ ద్వయం అద్వితీయం

సంగీతం..

అదో ప్రపంచం. అభిరుచి, ఆసక్తి, కఠోర సాధన ఎంతో అవసరం. అన్నీ కలగలిస్తేనే రాణించగలరు. అలాంటిది ఒకే కుటుంబం నుంచి వచ్చి తమ అద్వితీయ ప్రతిభతో సంగీతాభిమానులను అలరిస్తున్నారీ ద్వయాలు. సంగీతోత్సవాలలో తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను మైమరింపజేస్తున్నారు. అలాంటి వారిపై ప్రత్యేక కథనమిది.

13_005 విదేశీయ శిల్పాలు

ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క శాస్త్రీయం, అనేక పామర నాట్యాలు. ఈ విభిన్నత నన్ను ఆకట్టుకుంది.
అందుకే వాటికి సంబంధించినవి కనబడితే చాలు… నిశితంగా గమనించకుండా వదిలిపెట్టలేదు. వాటికి కావలసిన దుస్తులు, ఆభరణాలు, భంగిమలు. అలంకరణలు.. అన్నీ తెలుసుకున్నాను. ఎందరో కళాకారుల ఆహార్యాన్ని, నాట్యాన్ని గమనించాను. కావలసిన సరంజామా సమకూర్చుకుని వాటిపై ప్రయోగాలు చేశాను. పట్టుదలగా కొనసాగించి చివరకు సాధించాను. భరతనాట్యం, కూచిపూడి, కథక్, మోహినీయాట్టం, కథకళి, మణిపురి, ఒడిస్సీ బొమ్మలు చేసేశాను.

13_004 తోలుబొమ్మలాట

అయిదారేళ్ళ వయసులోనే భరతనాట్యానికి పరిచయం కావడం కళలపై ఆకర్షణను, అంకితభావాన్ని కలిగించింది. భరతనాట్యం నేర్చుకుంటుండగా అన్నీ కళలూ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయనిపించింది. ఆ భావనే నన్ను ప్రాచీన కళలను పరిరక్షించాలన్న నినాదంతో చలనచిత్రాన్ని తీసేలా ప్రేరేపించింది.

13_003 నవవిధ భక్తి మార్గం

భగవంతుడిపై చూపే ప్రేమకే ‘ భక్తి ’ అని పేరు. దేవుడితో బంధం ఏర్పడేది బాహ్య క్రియలతో కాదు, మలినం లేని భక్తితోనే అని పురాణాలు చెబుతున్నాయి. భక్తుడు భగవంతుని చేరేందుకు ఉపయోగపడే సూత్రాలు పదకొండింటిని నారదుడు ఉపదేశించగా తదనంతరం అవి తొమ్మిదిగా క్రోడీకృతమయ్యాయి.
నిజానికి ఇవి భక్తి మార్గాలు కావు. భక్తికి తొమ్మిది మెట్లు లేక తొమ్మిది లక్షణాలుగా వేదవ్యాసుడు పేర్కొన్నారని ప్రముఖ సంగీత శాస్త్ర నిపుణుడు డాక్టర్ పప్పు వేణుగోపాలరావు అంటారు.

13_002 ఆనాటి రాక్షస వీణ – వైయోలిన్

క్రీస్తు పూర్వం ఐదు వేల సంవత్సరాల నాటిది మన దేశంలోని ‘ రావణ హత్త ’ ఎటువంటి మార్పులూ లేకుండా అప్పటి ఆకార విశేషాలతోనే ఉన్న ఈ వాయిద్యం ఇప్పటికీ రాజస్తాన్, గుజరాత్ లలోని జనపదాల మధ్య మోగుతూ ఉండడం విశేషం. 22 అంగుళాల ఈ వాయిద్యం తయారీ ఆసక్తికరంగా ఉంటుంది. ఒక కొబ్బరి చిప్పను మేక చర్మంతో కప్పి, వెదురుతో చేసిన దండితో కలుపుతారు. దీనిపై రెండు తీగలను బిగిస్తారు. ఒకటి గుర్రం వెంట్రుకతో చేసినది, ఇంకొకటి స్టీల్ తో చేసినది. అప్పట్లో నేటి రాజస్తాన్, గుజరాత్ లలోని రాజ్యాల యువరాజులకు మొట్టమొదట ఈ వాయిద్యం మీదే సంగీత శిక్షణనిచ్చేవారు. ఇదే వాయిద్యం తొమ్మిదో శతాబ్దంలో తూర్పు మధ్య దేశాలకు, యూరప్ కు చేరిందట. ఐరోపా దేశంలో దీన్ని ‘ రావణ స్ట్రాంగ్ ’ అని పిలిచేవారు. వైయోలిన్, వయోలా, గిటార్ వంటి పరికరాలు ఇందులో నుంచే క్రమంగా రూపుదిద్దుకున్నాయి.

13_001 లలిత సంగీత ధృవతార

కేంద్ర సంగీత నాటక అకాడమీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన “అమృత్” పురస్కారం తనే స్వయంగా అందుకుంటారని నమ్మాను. ఆ అత్యుత్తమ పురస్కారం తరువాత ఇద్దాం, ముందు ఫెలోషిప్ ప్రకటించినవారికి అవి అందజేద్దాం, అన్నారట. నాలాంటి చిత్తరంజన్ అభిమానులు, శిష్యులు ఎంతో నిరాశ చెందారు. కానీ, ఈ అనుభూతులను ఏనాడో దాటేసిన ఆ మహనీయుడు, “అంతా మన మంచికే జరుగుతుంది తల్లీ. సుబ్రహ్మణ్య స్వామి అలా నిర్ణయించారు.” అని చెప్పినట్టు అనిపించింది. ‘ఆయన సమభావాన్ని, నిర్లిప్తతని గౌరవించాలంటే ఆయనని గుర్తించి గౌరవించాలని అనుకున్నవారిని గౌరవించాలి.’ అనిపించింది.

12_011 అన్నమయ్య పాట తో…

సామజము గాంచినది సంకీర్తనం
సామమున కెక్కుడీ సంకీర్తనం
సామీప్య మిందరికి సంకీర్తనం
సామాన్యమా విష్ణు సంకీర్తనం

12_010 సంగీత సాగరంలో తెలుగు సోయగం

కర్ణాటక సంగీతం భక్తిమయం, అథ్యాత్మికం. సంగీతంలో ఎంత ప్రావీణ్యమున్నా సాహిత్యార్థం తెలియకపోతే వాగ్గేయకారుల భావాలను, సందేశాలను ప్రేక్షకులకు చేరవేసేదెలా? అందుకే కళాకారులకు సాహిత్యార్థం తెలుసుకోవడం తప్పనిసరి. ఈ కారణంగానే రాగభావంతో పాటు నేను నేర్చుకునే కీర్తనల భావాన్ని కూడా తప్పనిసరిగా తెలుసుకుంటాను.