Health

13_007 మందాకిని – వృక్షో రక్షతి రక్షితః

తెల్లవారే సరికి రకరకాల పూలు పూసి మురిపించేవి. దొడ్లో కాసిన కూరలు అప్పటికప్పుడు కోసి వండుకొంటే రుచి, ఆరోగ్యం,ఆనందం. జామపండ్లు, మామిడి పండ్లు చెట్టునుండి కోసుకొని,కోరుక్కు తిన్న తృప్తి అనుభవైక వేద్యం.
రోడ్డుకి ఇరువైపులా ఎండకి నీడని,వానకి రక్షణని ఇస్తూ చెట్లు గొడుగులా నిలబడేవి. ఇప్పుడేవీ ? అవన్నీ గతకాల వైభవాలుగా మారిపోయినాయి. ఆ చక్కటి వృక్షాలన్నీ పట్టణాలలో ఆకాశహర్మ్యాలకు బలి అయిపోయాయి.

13_005 డేకేర్ సంస్థలు – ఒక వరం

అమెరికా లో నివసిస్తున్న భారత దేశ వృద్ధులకు సమయము యెట్లా గడుస్తున్నది అనే దానికి నేను, మా వారు… మేమే ఒక నిదర్శనము. ఇంట్లో అమ్మాయి – అల్లుడు ఉదయాన్నే ఉద్యోగరీత్యా బయిటకు వెడతారు. వారి పిల్లలు… మా మనవలు, మనుమరాలు స్కూల్, కాలేజీలకు వెళ్తారు. ఇక మేము ఉదయం నుంచి సాయంకాలం వరకు, వాళ్ళు ఇంటికి వచ్చేదాక ఏమి తోచక కాలం గడపాలి !!! మాకు ఆరోగ్యం సరిగ్గా లేకపోయినప్పుడు చూసే వాళ్ళు వుండరు. అప్పుడు, అమ్మాయికి వీలైతే ఆఫీసుకి సెలవు పెట్టి ఇంటి నుంచి పని చేసుకుంటుంది. అలా వీలు కానప్పుడు మాకు మేమే తప్పదుగా.