Hibiscus

13_004 సాక్షాత్కారము 07

చావు ముంచుకొని వచ్చిన
జీవుల కిక భయ మెక్కడ ?
నిరాశ నిండినదీనుల
నిట్టూర్పుల కం తెక్కడ ?

13_003 మందాకిని – తీర్మానం

మృగరాజు సభ ప్రారంభిస్తూ “ ఈమధ్య మానవజాతిలో మగాళ్లను ‘ మృగాడు ’ అంటూ మనతో పొలుస్తున్నారని తెలిసింది. అలా ఎందుకు అంటున్నారని అడుగుతున్నారా ? ఆ విషయం గురించి చర్చించడానికే ఈ సమావేశం.
వాళ్ళ పురాణాల్లో కీచకుడు, రావణాసురుడు లాంటి కొందరు, ఎంతో గొప్ప రాజులయినప్పటికీ స్త్రీలను అవమానించి చెరబట్టే వాళ్ళని కథలు ప్రచారంలో వున్నాయి. వారికి చెడ్డవారిగా ముద్ర పడింది. అట్లా ఎవరూ చేయకూడదనే నీతిని బోధించే కథలు. కానీ ఈనాడు వారినే కొందరు అనుసరిస్తున్నారు.

13_002 మందాకిని – నీలోత్పల

ఉత్తుంగ తరంగాలతో ఎగిసిపడే ఈ జలవాహిని చూస్తూ వుంటే కాలంతో పోటీగా పరుగెత్తాలని ప్రయత్నిస్తుందా అనిపిస్తుంది. పరవళ్ళు తొక్కుతూ పరుగెత్తుకొచ్చే అలలకు కూడా గమ్యం లేదు. నేను ముందంటే నేను ముందు అంటూ వచ్చి ఒడ్డును తాకే అలలు, ఆ అలలు మోసుకొచ్చే అల్చిప్పలు, సముద్రం మీద నుంచి వీచే స్వచ్చమైన గాలి, విస్టారంగా విశ్వమంతా పరుచుకొని ఎక్కడో కనుచూపుకి ఆననంత దూరంగా సముద్రాన్ని తాకుతున్నట్లున్న నీలాకాశం, ఆకాశంలో గుంపులు గుంపులుగా ఎగురుతూ గూళ్లను చేరుకొంటున్న పక్షులు ఇదంతా చూస్తూ వుంటే సృష్టి ఇంత అద్భుతమైనదా ? అని ఆశ్చర్యం కలుగుతుంది. రాత్రనక పగలనక హోరుమని శబ్దం చేస్తూ ఉండే ఈ జలరాశి ఇక్కడ ఎప్పటి నుంచి వుంది ? కొన్ని కోట్ల సంవత్సరాల నించి ఇలాగే వుందా ? కదలకుండా ఇక్కడే వుండమని ఎవరు శాసించి వుంటారు ? ఏది ఏమైనా సముద్రం వంక చూస్తూ వుంటే మనల్ని మనం మనం మర్చిపోతాం. ప్రపంచాన్ని మర్చిపోతాం. బాధలు, భయాలు, ఆశలు, నిరాశలు సమస్తం మాయమయి పోతాయి.

13_002 సాక్షాత్కారము 05

తే. గీ. ఏమహాశక్తి త న్నావహించెనొ ? యన
తరుణిపై పతి ప్రేమగీతాలు పాడు :
అంత నెద పొంగి మగతోడు నరసియరసి
కూర్మి గట్టిగా వాటేసికొను కపోతి !

13_001 సాక్షాత్కారము 04

తే. గీ. ధరణి రాలియు వాడక పరిమళాలు
తఱగనిబొగడపూ లేమితపము చేసె !
ౘచ్చియును కీర్తి దేహాన శాశ్వతు లయి
బ్రతుకు త్యాగుల కివి ఒజ్జబంతు లేమొ !

12_010 ఆనందవిహారి

చెన్నై లోని అమరజీవి స్మారక సమితి వారి ‘ నెల నెలా వెన్నెల ‘ కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ నెల కార్యక్రమం శ్రీ షణ్ముఖి నాట్య మండలి, పాలంగి వారు సమర్పించిన ‘ కళామందారం – సాంస్కృతిక కదంబ కార్యక్రమం ‘ విశేషాలు,……