Holi

13_007 ఓం నమశ్శివాయః – హోళికా పూర్ణిమ

ఓం నమశ్శివాయః
మాఘమాసంలో బహుళ పక్ష చతుర్దశి నాడు మహాశివరాత్రి జరుపుకుంటాము. క్షీరసాగర మధన సమయంలో భయంకరమైన హాలాహలం వెలువడింది, దాని నుంచి వెలువడుతున్న విషజ్వాలల వలన ప్రపంచమంతా నాశనం అయ్యే పరిస్తితి ఉత్పన్నమయింది. అప్పుడు దేవతలంతా శివుని ప్రార్థించారు. వారి ప్రార్థనకు కరిగిపోయి ఒక్క గుక్కలో ఆ హాలాహలాన్ని మింగేశాడు. ఆ విషం ఆయన గొంతు నుంచి క్రిందకు జారితే సమస్త విశ్వం ప్రమాదంలో పడుతుందని గ్రహించిన పార్వతి శివుని గొంతుని నొక్కిపెట్టి ఆ హాలాహలం క్రిందకు జరకుండా చూస్తుంది. దానివలన ఆయన కంఠం కమిలిపోయి నీల వర్ణానికి మారిపోవడంతో ‘ నీలకంఠుడు ’ అయ్యాడు. ఈ సంఘటన జరిగిన రోజే ‘ శివరాత్రి ’ పర్వదినం అయింది.