Illustration

13_006 ఆ ద్వయం అద్వితీయం

సంగీతం..

అదో ప్రపంచం. అభిరుచి, ఆసక్తి, కఠోర సాధన ఎంతో అవసరం. అన్నీ కలగలిస్తేనే రాణించగలరు. అలాంటిది ఒకే కుటుంబం నుంచి వచ్చి తమ అద్వితీయ ప్రతిభతో సంగీతాభిమానులను అలరిస్తున్నారీ ద్వయాలు. సంగీతోత్సవాలలో తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను మైమరింపజేస్తున్నారు. అలాంటి వారిపై ప్రత్యేక కథనమిది.

13_005 విదేశీయ శిల్పాలు

ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క శాస్త్రీయం, అనేక పామర నాట్యాలు. ఈ విభిన్నత నన్ను ఆకట్టుకుంది.
అందుకే వాటికి సంబంధించినవి కనబడితే చాలు… నిశితంగా గమనించకుండా వదిలిపెట్టలేదు. వాటికి కావలసిన దుస్తులు, ఆభరణాలు, భంగిమలు. అలంకరణలు.. అన్నీ తెలుసుకున్నాను. ఎందరో కళాకారుల ఆహార్యాన్ని, నాట్యాన్ని గమనించాను. కావలసిన సరంజామా సమకూర్చుకుని వాటిపై ప్రయోగాలు చేశాను. పట్టుదలగా కొనసాగించి చివరకు సాధించాను. భరతనాట్యం, కూచిపూడి, కథక్, మోహినీయాట్టం, కథకళి, మణిపురి, ఒడిస్సీ బొమ్మలు చేసేశాను.

13_004 తోలుబొమ్మలాట

అయిదారేళ్ళ వయసులోనే భరతనాట్యానికి పరిచయం కావడం కళలపై ఆకర్షణను, అంకితభావాన్ని కలిగించింది. భరతనాట్యం నేర్చుకుంటుండగా అన్నీ కళలూ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయనిపించింది. ఆ భావనే నన్ను ప్రాచీన కళలను పరిరక్షించాలన్న నినాదంతో చలనచిత్రాన్ని తీసేలా ప్రేరేపించింది.

13_003 నవవిధ భక్తి మార్గం

భగవంతుడిపై చూపే ప్రేమకే ‘ భక్తి ’ అని పేరు. దేవుడితో బంధం ఏర్పడేది బాహ్య క్రియలతో కాదు, మలినం లేని భక్తితోనే అని పురాణాలు చెబుతున్నాయి. భక్తుడు భగవంతుని చేరేందుకు ఉపయోగపడే సూత్రాలు పదకొండింటిని నారదుడు ఉపదేశించగా తదనంతరం అవి తొమ్మిదిగా క్రోడీకృతమయ్యాయి.
నిజానికి ఇవి భక్తి మార్గాలు కావు. భక్తికి తొమ్మిది మెట్లు లేక తొమ్మిది లక్షణాలుగా వేదవ్యాసుడు పేర్కొన్నారని ప్రముఖ సంగీత శాస్త్ర నిపుణుడు డాక్టర్ పప్పు వేణుగోపాలరావు అంటారు.

13_002 ఆనాటి రాక్షస వీణ – వైయోలిన్

క్రీస్తు పూర్వం ఐదు వేల సంవత్సరాల నాటిది మన దేశంలోని ‘ రావణ హత్త ’ ఎటువంటి మార్పులూ లేకుండా అప్పటి ఆకార విశేషాలతోనే ఉన్న ఈ వాయిద్యం ఇప్పటికీ రాజస్తాన్, గుజరాత్ లలోని జనపదాల మధ్య మోగుతూ ఉండడం విశేషం. 22 అంగుళాల ఈ వాయిద్యం తయారీ ఆసక్తికరంగా ఉంటుంది. ఒక కొబ్బరి చిప్పను మేక చర్మంతో కప్పి, వెదురుతో చేసిన దండితో కలుపుతారు. దీనిపై రెండు తీగలను బిగిస్తారు. ఒకటి గుర్రం వెంట్రుకతో చేసినది, ఇంకొకటి స్టీల్ తో చేసినది. అప్పట్లో నేటి రాజస్తాన్, గుజరాత్ లలోని రాజ్యాల యువరాజులకు మొట్టమొదట ఈ వాయిద్యం మీదే సంగీత శిక్షణనిచ్చేవారు. ఇదే వాయిద్యం తొమ్మిదో శతాబ్దంలో తూర్పు మధ్య దేశాలకు, యూరప్ కు చేరిందట. ఐరోపా దేశంలో దీన్ని ‘ రావణ స్ట్రాంగ్ ’ అని పిలిచేవారు. వైయోలిన్, వయోలా, గిటార్ వంటి పరికరాలు ఇందులో నుంచే క్రమంగా రూపుదిద్దుకున్నాయి.

13_001 లలిత సంగీత ధృవతార

కేంద్ర సంగీత నాటక అకాడమీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన “అమృత్” పురస్కారం తనే స్వయంగా అందుకుంటారని నమ్మాను. ఆ అత్యుత్తమ పురస్కారం తరువాత ఇద్దాం, ముందు ఫెలోషిప్ ప్రకటించినవారికి అవి అందజేద్దాం, అన్నారట. నాలాంటి చిత్తరంజన్ అభిమానులు, శిష్యులు ఎంతో నిరాశ చెందారు. కానీ, ఈ అనుభూతులను ఏనాడో దాటేసిన ఆ మహనీయుడు, “అంతా మన మంచికే జరుగుతుంది తల్లీ. సుబ్రహ్మణ్య స్వామి అలా నిర్ణయించారు.” అని చెప్పినట్టు అనిపించింది. ‘ఆయన సమభావాన్ని, నిర్లిప్తతని గౌరవించాలంటే ఆయనని గుర్తించి గౌరవించాలని అనుకున్నవారిని గౌరవించాలి.’ అనిపించింది.

12_012 అపరాధ సహస్రాణి

కళలమ్మ పాదాలపై పడి జన్మలు వేడుకున్నా దొరకని వరం కళాప్రవేశం!
రేణువంత దొరికినా అది ఆ చల్లనితల్లి కృప!
ఏదో జన్మవాసనలు మనసునిపట్టి ఏదైనా ఒక్క లలితకళలో ఆవగింజంత అభినివేశం దొరికినా జన్మధన్యమే!
దానిని పరిపూర్ణాంగా కాకపోయినా..కొనఊపిరి ఉన్నంతవరకూ నిలబెట్టుకోవడం అసిధారావ్రతం!

12_012 తిరువారూరు విశిష్టత

కాలం చేసిన తరువాతే “ సంగీత త్రిమూర్తులు ” గా పేరు గాంచినా, వారికి మాత్రం ముందే తెలిసిందేమో…. తాము కారణ జన్ములమని, అందుకే ముగ్గురూ ఒకే ఊరిలో, అది కూడా ఒకే ఆలయానికి దగ్గరలో జన్మించారు. ఒకే కాలంలో జీవించి సమకాలికులయ్యారు. ఆ పుణ్యభూమే తమిళనాడులోని తిరువారూరు. వారు పుట్టిన తరువాత వారి వారి కుటుంబాలు తిరువయ్యూరు తదితర ప్రాంతాలకు తరలి వెళ్ళినా చరిత్రకు ఆనవాళ్ళుగా, సంగీత విద్యార్థులకు తీర్థ యాత్రా స్థలాలుగా ఇప్పటికీ ఆ మహా వాగ్గేయకారులు జన్మించిన ఇల్లు వెలుగొందుతున్నాయి.

12_011 అన్నమయ్య పాట తో…

సామజము గాంచినది సంకీర్తనం
సామమున కెక్కుడీ సంకీర్తనం
సామీప్య మిందరికి సంకీర్తనం
సామాన్యమా విష్ణు సంకీర్తనం

12_011 భక్తి విప్లవకారులు – భగవద్రామానుజులు

ప్రతి యుగంలోనూ కొందరి మహానుభావుల ఆగమనం వల్ల ఈ ప్రపంచంలో ధర్మవర్తనులు సంఖ్య ఉంటూనే ఉంది. అయితే దేశ కాలాదులను బట్టి ధర్మం కొంత మారుతూ ఉంటుంది. ఆయా సమయ సందర్భాలననుసరించి సమాజోద్ధరణ గావించేవారు వారి కాలానికి తగినట్లుగా ధర్మబోధనలు చేస్తుంటారు. అయితే ఏ కాలంలోనైనా వారి సమకాలీన సమాజంలో ఉన్న దురాచారాలను ఖండించడం, సదాచారాలను బోధించడం తద్ద్వారా మానవులను ఉద్ధరించడం, నవసమాజ నిర్మాణం గావించడం అరుదుగా జరుగుతుంటాయి.