International

13_008 రామచరిత మానస్

ఈ ఘట్టంలో సీతారాముల కల్యాణ సమయంలో ఆ వధూవరుల రూపవర్ణన, వారు ధరించిన విభిన్న ఆభూషణాల సహితంగా సీతారాముల వర్ణన, లక్ష్మణ, భరత శత్రుఘ్నుల వర్ణన, ఆరోజు అందచేయబడిన విందు, బహుమతుల సహితంగా వర్ణించబడుతోంది.

13_006 నల్లని మేని నగవు చూపులవాడు ”…

శ్రీమతి భవ్య బేహత గారు అమెరికా చికాగో నగరంలో రెండు దశాబ్దాలుగా వీణ గాత్రం విద్యార్థులకి నేర్పుతున్నారు. బలమైన సంగీత సంప్రదాయాన్ని అమెరికా లో పటిష్ఠం చేస్తూ పాశ్చాత్య సంగీత కళాకారుల మన్ననలు పొందుతున్నారు. భవ్య బేహత డా. ఈమని కల్యాణి గారి నుండి ఈమని వీణా సంప్రదాయ పద్ధతి అభ్యసించి ప్రచారం చేస్తున్నారు. చికాగో “ రాగ ప్రభ “ అంతర్జాతీయ వీణా ఉత్సవాల సందర్భంగా అన్నమాచార్యుల వారి పద సంకీర్తనలు శిష్యులతో ప్రదర్శించారు.

13_005 విదేశీయ శిల్పాలు

ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క శాస్త్రీయం, అనేక పామర నాట్యాలు. ఈ విభిన్నత నన్ను ఆకట్టుకుంది.
అందుకే వాటికి సంబంధించినవి కనబడితే చాలు… నిశితంగా గమనించకుండా వదిలిపెట్టలేదు. వాటికి కావలసిన దుస్తులు, ఆభరణాలు, భంగిమలు. అలంకరణలు.. అన్నీ తెలుసుకున్నాను. ఎందరో కళాకారుల ఆహార్యాన్ని, నాట్యాన్ని గమనించాను. కావలసిన సరంజామా సమకూర్చుకుని వాటిపై ప్రయోగాలు చేశాను. పట్టుదలగా కొనసాగించి చివరకు సాధించాను. భరతనాట్యం, కూచిపూడి, కథక్, మోహినీయాట్టం, కథకళి, మణిపురి, ఒడిస్సీ బొమ్మలు చేసేశాను.

13_004 తోలుబొమ్మలాట

అయిదారేళ్ళ వయసులోనే భరతనాట్యానికి పరిచయం కావడం కళలపై ఆకర్షణను, అంకితభావాన్ని కలిగించింది. భరతనాట్యం నేర్చుకుంటుండగా అన్నీ కళలూ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయనిపించింది. ఆ భావనే నన్ను ప్రాచీన కళలను పరిరక్షించాలన్న నినాదంతో చలనచిత్రాన్ని తీసేలా ప్రేరేపించింది.

12_012 ఆనందవిహారి

అమెరికా లోని చికాగో నగరంలో జరిగిన అంతర్జాతీయ వీణా ఉత్సవాలలో భాగంగా ప్రముఖ సంగీత దర్శకుడు వీణాపాణి ప్రదర్శన విశేషాలు,……

12_011 ఆనందవిహారి

అమెరికా చికాగో దగ్గరలో ఫ్లాస్ మోర్ లో మే నెల 6 వ తేదీ, 7వ తేదీలలో డా. శారదాపూర్ణ శొంఠి గారి ఆధ్వర్యంలో ఇల్లినాయిస్ కు చెందిన ‘ సునాద సుధ ’ నిర్వహించిన 23వ అంతర్జాతీయ వీణ ఉత్సవం “ రాగధార ” విశేషాలు, చెన్నై లోని అమరజీవి స్మారక సమితి వారి ‘ నెల నెలా వెన్నెల ‘ కార్యక్రమంలో భాగంగా మే నెల కార్యక్రమం ఎర్రమిల్లి శారద గారి ప్రసంగం ‘ తెలుగు సాహిత్యంలో జానపద జీవిత చిత్రణ ‘ విశేషాలు,……

11_004 తో. లే. పి. – ఆర్టిస్ట్ వాట్స్

ఒక రచన చదివినా, ఒక చిత్రాన్ని చూసినా మనలో ఒక స్పందన కలగడం సహజం. అయితే, ఆ వెంటనే ఆ స్పందనను ఉత్తరరూపంలో ఆ రచయిత కు కానీ చిత్రకారునికి గానీ తెలియపరచడం పాఠకుని ప్రధమ కర్తవ్యం. అది అవతలివారికి కూడా స్ఫూర్తిని ఇస్తుంది. అనడం లో ఎట్టి సందేహానికి తావు లేదు.

11_001 మా యూరోప్ పర్యటన – జర్మనీ

Maa Europe Paryatana – Germany

ప్లాజాలో తిరుగుతుండగా నా చీర, బొట్టు చూసి ఒకతను సంజ్ఞలు చేస్తూ ఏదో మాకు తెలియని భాషలో అడుగుతూ మాటలు కలిపాడు. అతన్ని తప్పించుకుని ఓ షాప్ లోకి వెళ్ళగానే ఫోటో రీలు కొనడానికి పర్స్ కనబడలేదు. బాక్ పాకెట్ లోంచి మాయం. అతి లాఘవంగా ఆ ఆగంతకుడు లాగేశాడు మావారి దగ్గర.