Intraduction

13_001 చిన్న చిన్న ఆనందాలు

ఎవరితో మాట్లాడాలన్నా…అంతా బిజీ. టైమే వుండదు. సోషల్ లైఫ్… అన్నది అస్సలు లేకుండా పోయింది. అదే… ఇక్కడ ఐతేనా… బోలెడంత కాలక్షేపం. చుట్టుపక్కల అంతా తెలిసిన వాళ్ళే. పరిచయాలు పెంచుకోవడం కూడా చాలా సులువు. రోడ్డు మీద వెళ్తున్న ఎవరినైనా పలకరిస్తే చాలు మాటలతో మనసును రంజింప జేస్తారు మరి. కూరలు పళ్ళు అమ్ముకునే వాళ్ళతో లోకాభిరామాయణం తో గప్పా గోష్టి చెయ్యవచ్చు. పని పిల్లతో దాని జీవిత సమస్యలు చర్చించ వచ్చు. కావాలంటే ఉచితంగా సలహాలు పారెయ్యచ్చు. వీధి గుమ్మం ముందు నించుని రోడ్డు మీద ఆడుకునే పిల్లల్ని గమనిస్తే చాలు మనసు నిండడానికి.