Kaleepatnam
13_009 మహాగణపతిమ్…
మహా దేవ సుతం గురుగుహ నుతం |
మార కోటి ప్రకాశం శాంతం ||
మహా కావ్య నాటకాది ప్రియం
మూషిక వాహనా మోధక ప్రియం ||
13_008 రామచరిత మానస్
ఈ ఘట్టంలో సీతారాముల కల్యాణ సమయంలో ఆ వధూవరుల రూపవర్ణన, వారు ధరించిన విభిన్న ఆభూషణాల సహితంగా సీతారాముల వర్ణన, లక్ష్మణ, భరత శత్రుఘ్నుల వర్ణన, ఆరోజు అందచేయబడిన విందు, బహుమతుల సహితంగా వర్ణించబడుతోంది.
13_007 మధురాష్టకం
వచనం మధురం చరితం మధురం
వసనం మధురం వలితం మధురం |
చలితం మధురం భ్రమితం మధురం
మధురాధిపతేరఖిలం మధురం
13_006 రామ రక్ష
ఇటీవలే అయోధ్యలో కొలువుదీరిన రామ్ లల్లా కోసం కాళీపట్నం సీతా వసంతలక్ష్మి గారు ఆలపించారు.
13_005 పరాశర్ – కథక్ కళాకారుడు
అమెరికాలో నివసిస్తున్న తెలుగు యువకుడు పరాశర్ వయసు 15 సంవత్సరాలు. కథక్ నృత్య గురువు శ్రీమతి స్వాతి సిన్హా వద్ద చిన్న వయసు నుంచే కథక్ నాట్యం అభ్యసించడం ప్రారంభించాడు. పరాశర్ తల్లి తల్లి శ్రీమతి ఆత్మకూరి సంధ్యశ్రీ కూడా భరతనాట్య కళాకారిణి. అమెరికా లోని మిషిగన్ స్టేట్, రిసెప్టర్ లో నాట్య ధర్మి పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అనే పేరుతో భరతనాట్య పాఠశాల నిర్వహిస్తున్నారు.
13_004 క్షీరాబ్ది కన్యకు
సాధారణంగా ఈ అన్నమయ్య కీర్తన ని శ్రీమతి ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారు మనకు వదిలి వెళ్లిన ఆనవాయితీ ప్రకారం ఝంపె తాళం లో పాడటం అందరికీ విదితమే. అయితే, ఝంపె తాళం కేవలం 5 అక్షరాలే కలిగి ఉన్నందున గాయకులు దాంతో కష్ట పడుతూండటం కూడా గమనిస్తూనే ఉంటాం. అలా కాకుండా త్రిశ్రగతిలో ఉంటే పాటను తాళాన్నీ కూడా మరింత సులువుగా సమర్ధించు కొనే వీలును కల్పించడానికి అదే పాటను ఇలా పాడే చొరవ తీసుకున్నాను.
13_003 గాంధీ ప్రియ భజన్
మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆయనకి ప్రియమైన మీరా భజన్…
హరి తుమ్ హారో జన్ కీ భీర్
ద్రోపదీ కీ లాజ్ రాఖీ, తుమ్ బదాయో చీర్….
13_002 గణేశ స్తుతి
చిత్రరత్న విచిత్రాంగం చిత్రమాలా విభూషితం।
కామరూప ధరం దేవం వందే హం గణనాయకమ్ ॥
—————————————
గజవదనా బేడువే గౌరీ తనయా
త్రిజ్జగ బందిద్దనే సుజనరపొరవనే ||
13_001 జో అచ్యుతానంద…
నీలాంబరి నిద్రపుచ్చుతుంది. శ్రావణ మాసపు చిరుజల్లులు, భోరున కురిసే ఘనమైన మేఘాలు, ఒకవైపున పిల్లలకు భయం కలిగిస్తాయి మరోవైపు పెద్దలకు అశాంతి, చింత, యువతకు పులకింతలు, మనసుకు గిలిగింతలూ కలిగిస్తూ ఉంటే, ఏ మూలనుండో సన్నగా వినిపించే ఈ లాలిపాట పాటలకు నిద్ర, పెద్దలకు ఊరట, పిన్నలకు శాంత చిత్తాన్ని ఇస్తుందనటంలో సందేహం లేదు.