Kanyasulkam

12_006 కన్యాశుల్కం – ఒక పరిశీలన

పెళ్ళికి బంధుమిత్ర గణం తో వచ్చి ఊరి బయట చెరువు దగ్గర కాలకృత్యాల కోసం ఆగిన అగ్నిహోత్రావధానులు… బుచ్చమ్మ, గిరీశం లేకపోవడం గ్రహించి, ఆమెకు కాపలాగా బండి లో ఎక్కించిన వేంకటేశాన్ని నిలదీస్తాడు. తనని రాత్రి పూట బండి మార్చారు అని వెంకటేశం చెప్పగా అగ్నిహోత్రావధాన్లు రౌద్రుడవుతాడు.