Kathak

13_005 పరాశర్ – కథక్ కళాకారుడు

అమెరికాలో నివసిస్తున్న తెలుగు యువకుడు పరాశర్ వయసు 15 సంవత్సరాలు. కథక్ నృత్య గురువు శ్రీమతి స్వాతి సిన్హా వద్ద చిన్న వయసు నుంచే కథక్ నాట్యం అభ్యసించడం ప్రారంభించాడు. పరాశర్ తల్లి తల్లి శ్రీమతి ఆత్మకూరి సంధ్యశ్రీ కూడా భరతనాట్య కళాకారిణి. అమెరికా లోని మిషిగన్ స్టేట్, రిసెప్టర్ లో నాట్య ధర్మి పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అనే పేరుతో భరతనాట్య పాఠశాల నిర్వహిస్తున్నారు.

13_005 విదేశీయ శిల్పాలు

ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క శాస్త్రీయం, అనేక పామర నాట్యాలు. ఈ విభిన్నత నన్ను ఆకట్టుకుంది.
అందుకే వాటికి సంబంధించినవి కనబడితే చాలు… నిశితంగా గమనించకుండా వదిలిపెట్టలేదు. వాటికి కావలసిన దుస్తులు, ఆభరణాలు, భంగిమలు. అలంకరణలు.. అన్నీ తెలుసుకున్నాను. ఎందరో కళాకారుల ఆహార్యాన్ని, నాట్యాన్ని గమనించాను. కావలసిన సరంజామా సమకూర్చుకుని వాటిపై ప్రయోగాలు చేశాను. పట్టుదలగా కొనసాగించి చివరకు సాధించాను. భరతనాట్యం, కూచిపూడి, కథక్, మోహినీయాట్టం, కథకళి, మణిపురి, ఒడిస్సీ బొమ్మలు చేసేశాను.