Lord

13_008 సంగీతం – సర్వేశ్వరుని చేర్చే సాధనం 12

ఎత్తైన, మెత్తని, చక్కని, చల్లని పూల సజ్జపై నీలదేవి కౌగిలిలో ఒదిగి వున్న మా స్వామీ కృష్ణయ్యా ! ఇలా నీ ఏకాంతానికి భంగం కలిగిస్తున్నందుకు మన్నించు. మా విన్నపం ఆలకించి బదులు పలుకు…. అంటూ నీలదేవి కౌగిలిలో సోలి నిద్రించు స్వామిని మేలుకొలుపుతున్నది గోదా…..

13_007 సంగీతం – సర్వేశ్వరుని చేర్చే సాధనం 11

మనమంతా ఎంత అదృష్టవంతులమో ! శ్రీలు పొంగిన రేపల్లె మన జన్మస్థలమైంది. ఓ నెచ్చెలులారా ! నిండు జవ్వనులారా !
కంసుని భయంతో వేలాయుధం చేత ధరించి రాత్రింబవళ్ళు నందరాజు తన ముద్దులయ్యను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. ఆ నల్లనయ్య యశోదాదేవి ఒడిలో కొదమసింగంలా ఆడుకుంటున్నాడు మనోజ్ఞంగా….. ఇలా గోదాదేవి పాశురాల విశేషాలను వివరిస్తున్నారు.

13_005 సంగీతం – సర్వేశ్వరుని చేర్చే సాధనం 10

దక్షిణ భారతదేశంలో ప్రభవించిన వాగ్గేయకారులలో ముఖ్యంగా మహిళా వాగ్గేయకారులలో ముఖ్యంగా చెప్పుకోదగిన పేరు గోదాదేవి. ఆమెకే ఆముక్తమాల్యద అనే పేరు కూడా ఉంది. శ్రీరంగం పట్టణానికి చెందిన గొప్ప విష్ణుభక్తుడు విష్ణుచిత్తుని కుమార్తె ఈమె. సీతాదేవి వలెనే ఈమె కూడా అయోనిజ. విష్ణుచిత్తుడు ఒకరోజు ఎప్పటిలాగే విష్ణు కైంకర్యానికి మాలలకోసం తులసి వనానికి వెళ్ళినపుడు అక్కడ దొరుకుతుంది. భగవత్ప్రసాదం గా భావించి ఇంటికి తెచ్చుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటారు ఆ దంపతులు. విష్ణుసేవలో ఎదిగిన గోదాదేవి రోజుకొకటి చొప్పున ముఫ్ఫై రోజులపాటు గానం చేసిన పాశురాలన్నిటినీ కలిపి ‘ తిరుప్పావై ’ అంటారు. ఈ విశేషాలను వివరిస్తున్నారు.

12_012 విప్రనారాయణ చరితం

పరమ భక్తుడైన విప్రనారాయణుడు విష్ణువుని రంగనాథుడి రూపంలో కొలుస్తూ ఉంటాడు. చోళ రాజు ఆస్థానంలో నృత్య ప్రదర్శన తర్వాత నర్తకి దేవదేవి తన చెల్లెలు మధురవాణితో కలసి వస్తూ విప్రనారాయణుని ఆశ్రమం మీదుగా వస్తూ ఉంటుంది. తనని పట్టించుకోకుండా దైవ కైంకర్యంలో మునిగిపోయిన నారాయణుని చూసి అహంకారిగా, పొగరుబోతుగా తలచి, అతనికి గుణపాఠం చెప్పాలనుకుంటుంది. అనాధగా చెప్పుకుంటూ నారాయణుని ఆశ్రమం లోకి ప్రవేశించి సహాయం కోరుతుంది. అయితే ఆమె ఆశ్రమంలో ఉండడంలోని ఉద్దేశ్యాన్ని పసిగట్టిన నారాయణుడి శిష్యుడు రంగరాజు అభ్యంతరం చెప్పినా వినకుండా అతన్ని బయిటకు పంపించి దేవదేవిని శిష్యురాలిగా చేసుకుంటాడు నారాయణుడు.

12_011 కృష్ణం వందే జగద్గురుం

అత్యంత సుందరాకారుడు రూపలావణ్యము, గానమాధుర్యము వ్రేపల్లెవాసులను మంత్రముగ్ధులను చేశాయి. ఆ బాలుడెవరో – ఆ తత్వమేమిటో వారికి ప్రశ్నార్ధకముగా నిలిచిపోయింది. ఆయన ఆ బాలుని క్షణము విడువ లేకపోయేవారు. ప్రాణసమానంగా చూసుకునేవారు. కృష్ణుని మురళీనాదం విని గోప స్త్రీలు అన్నీ మరచి కృష్ణుని వెంట పరుగెత్తేవారు. ప్రేమ, భక్తి ముడివడి వారికొక దివ్యానుభూతిని కలిగించేది.