లక్కీ గర్ల్ – నేపధ్యం చిన్నప్పుడు మా ఊరు నుంచి ఎక్కడకు వెళ్ళాలన్నాఓ అయిదు మైళ్ళు కాలినడకనో లేక ఎద్దుల బండి మీదనో వెళ్లే మాకు విమానం చప్పుడు వినిపిస్తే చాలు మా ఆనందానికి పట్టపగ్గాలు ఉండేవికావు. వెంటనే పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోయేవాళ్ళం. అలా పరిగెత్తుకుంటూ వెళ్లే...